Sun Transit Effeect: గ్రహాల రాజు సూర్య భగవానుడు (Lord sun) మరో నాలుగు రోజుల్లో తన రాశిని మార్చబోతున్నాడు. 11నెలల తర్వాత ఆగస్టు 17న సూర్యుడు (Sun) కర్యాటక రాశి (Cancer) నుంచి తన సొంత రాశి అయిన సింహరాశికి (Sun Transit in Leo) కి మారబోతున్నాడు. ఇదే సమయంలో సూర్యుడుని ఆహ్వానించేందుకు అక్కడే సిద్ధంగా ఉన్నాడు బుధుడు. వీరిద్ధరి కలయిక కారణంగా బుధాదిత్య యోగం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం (Astrology) ప్రకారం.. గ్రాహాల రాశలు ఎటు నుంచి ఎటు మార్పు చెందినా.. 100 శాతం ప్రయోజనకరం కాదు లేదా పూర్తిగా హానికరం కాదు. గ్రహాల గోచారం లేదా రెండు గ్రహాల కలయిక ప్రభావం మొత్తం 12 రాశులపై, వారి జీవితంపై పడుతుంటుంది. ఇది శుభం కావచ్చు లేదా అశుభం కావచ్చు. దీంతో బుధాదిత్య రాజయోగం ఉంటుంది. ఫలితంగా 3 రాశులవారికి ఊహించని లాభాలు కలగనున్నాయి. రాజయోగం కారణంగా మూడు రాశులపై భిన్న ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా సూర్యుడి రాశి మార్పు కారణంగా ఆగస్టు 17 నుండి ఈ రాశివారికి డబ్బే డబ్బు.. అంటున్నారు పండితులు..
వృశ్చిక రాశిపై సూర్య సంచారం ప్రభావం
ఆగస్టు 17 నుంచి సూర్యుడు.. సింహరాశిలోకి ప్రవేశిస్తున్న కారణంగా... వృశ్చిక రాశి (Scorpio)కి చెందిన ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారులు, ప్రముఖులతో స్నేహం వీరికి కలిసి వస్తుంది అంటున్నారు. అలాగే సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని చెబుతున్నారు.
ఈ సమయంలో కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉందని.. వ్యాపారులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుందంటున్నారు. ముఖ్యంగా పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయమని... ఆగిపోయిన పనులు పూర్తవుతాయని.. అదృష్టంతో వీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఈ సారి వారికి పూర్తిగా ధనలాభం ఉంటుందని పండితులు చెబుతున్నారు.
ఇదీ చదవండి : ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి జాతర ముహర్తం ఖరారు.. ఎప్పటి నుంచి అంటే?
సింహరాశిపై సూర్య సంచార ప్రభావం
సింహ రాశి (Leo)వారికి సూర్యుడు తమ ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా బాస్ తో గొడవపడకుండా వారి చెప్పింది చేస్తారు. పూర్వీకుల వ్యాపారంలో నిమగ్నమైన వ్యాపారవేత్తలకు ఈ సమయం కలిసి వస్తుంది. భర్త లేదా భార్య ఏ పని చేయాలనుకుంటే వారికి భాగస్వామి పుల్ సపోర్టు ఉంటుంది అంటున్నారు. అలాగే ఈ రాశి వారు పిటినెస్ పై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి : సమస్యల్లో ఉన్నారా? ఒక్కసారి సంపత్ వినాయకుడ్ని దర్శించుకోండి..? ఎక్కడో తెలుసా?
తులారాశివారిపై బుధాదిత్య రాజయోగం ఫలితం
తులా రాశి (Libra) వారి ఆదాయం పెరుగే అవకాశం ఉంటుంది. ఆదాయానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఈ కాలంలో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం మంచిదిగా సూచిస్తున్నారు. అలాగే ఆస్థులు, వాహనాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేందుకు అనువైన సమయం. విదేశాల్నించి ధనం సంపాదించే అవకాశాలు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astro Tips, Astrology, Earning money, Future Prediction, Zodiac signs