హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

vastu shastra: వాస్తు ప్రకారం ఇలాంటి మొక్క మీ ఇంట్లో ఉంటే.. అరిష్టమే!

vastu shastra: వాస్తు ప్రకారం ఇలాంటి మొక్క మీ ఇంట్లో ఉంటే.. అరిష్టమే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మన సాంప్రదాయం ప్రకారం వెళ్లకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే.. ఇంట్లో అపరిశుభ్రత అనేక సమస్యలకు కారణమవుతుంది. అటువంటి ఇళ్లలో నెగిటివిటీకి కేంద్రమవుతుంది.

ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసేది డబ్బుల కోసం. కానీ, కొంతమంది ఎంత కష్టపడినా.. ఆర్థికంగా (financial)  వెనుకబడి ఉంటారు. దీనికి వాస్తు శాస్త్రం (vastu shastra) ప్రకారం వారు చేసే చిన్న తప్పులే దీనికి ప్రధాన కారణం. ఇళ్లు నిర్మించేటపుడు చేసే చిన్న తప్పులు ఇంట్లో సుఖసంతోషాలకు అడ్డుగా మారతాయి. ఇంట్లో నెగిటివిటీకి దారితీస్తుంది. ఆ తప్పులు ఏంటో తెలుసుకుందాం.

ఆగిపోయిన గడియారం..

వాస్తుశాస్త్రం (vastu shastra) ప్రకారం ఇంట్లో ఆగిపోయిన గడియారం ఉండకూడదు. దీంతో ఆ ఇంట్లోకి నెగిటివ్‌ ఎనర్జి ప్రవేశిస్తుంది. అలాగే, విరిగిన గడియారం కూడా పెట్టుకోకూడదు. మీ ఇంట్లో ఏదైనా ఆగిపోయిన వాచ్‌ ఉంటే, వెంటనే దాన్ని రిపెయిర్‌ చేయించండి లేదా ఇంట్లో నుంచి తీసేయండి.

చనిపోయిన మొక్కలు..

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆవరణలో చనిపోయిన మొక్కలు ఉండకూడదు. చనిపోయిన మొక్కలు ఇంటి వాతావరణాన్ని డిస్ట్రర్బ్‌ చేస్తాయి. అందుకే మీరు ఇంట్లో మొక్కలను పెంచుకుంటే దానిపై సరైన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. నిత్యం నీరు పోయాలి. దీంతో కూడా మీకు శుభాలు కలుగుతాయి.

ఇది కూడా చదవండి: చక్కెర ప్యూరిటీని గుర్తించండి! లేకపోతే అందులో యూరియా..

వాటర్‌ లీకేజీ...

ఇంట్లో కుళ్లాయిల్లో తరచూ నీరు పోతుంటే..మంచిది కాదు. ట్యాప్, పైప్‌ లీకేజీ లేదా వాటర్‌ ట్యాంక్‌ నిండిపోనివ్వకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం మీ సంపద కూడా ఇదే విధంగా కరిగిపోతుంది.

ఇల్లు పరిశుభ్రంగా..

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లేకపోతే ఆ ఇంట్లోకి నెగిటివ్‌ ఎనర్జీ ప్రవేశిస్తుంది.

ఇది కూడా చదవండి:  ఈ టిప్‌తో మీ జుట్టు వత్తుగా.. స్ట్రాంగ్‌గా పెరుగడం ఖాయం!

పరిశుభ్రంగా ఉంటేనే ఆ ఇంట్లో లక్షీదేవి తాండవిస్తుందని మన పూర్వీకులు సైతం చెబుతారు.

అదేవిధంగా ఇంట్లో పగిలిపోయిన అద్దం కూడా ఉండకూడదు. వీటిలో ముఖం చూసుకోకూడదు. ఏదైనా దేవుళ్ల విగ్రహలైనా... అరచేతి గీతలను చూసుకోవాలి. అలాగే పాడైపోయిన పాత వస్తువులను అస్సలు పెట్టుకోకూడదు. చిన్న పిల్లల ఆటవస్తువులను కూడా ఉంచకూడదు. విరిగిన మంచాలు ఇతర ఫర్నిచర్‌ ఇంట్లో పెట్టుకోకూడదు. దీనివల్ల కూడా ఇంట్లోకి నెగిటివ్‌ ఎనర్జీ ప్రవేశించి ఆ ఇంట్లో సంపదలకు లోటు కలుగుతుంది. ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పుల కుప్పలు లేకుండా చూసుకోవాలి. లేకపోతే, అటువంటి ఇళ్లలో నెగిటివ్‌ ఎనర్జీ ప్రవేశిస్తుంది.

Published by:Renuka Godugu
First published:

Tags: Vastu Tips

ఉత్తమ కథలు