Home /News /astrology /

ACCORDING TO VASTU SHASTRA KNOW WHICH DIRECTION WOULD IT BE RIGHT TO PLACE THE ITEMS PURCHASED ON DHANTERAS HERE THE FULL DETAILS GH SRD

Zodiac Signs: ధన త్రయోదశికి కొనుగోలు చేసిన వస్తువులను ఎక్కడ పెట్టాలి? మీరాశి ప్రకారం ఏ దిశలో ఉంచాలంటే..

Zodiac Signs

Zodiac Signs

Zodiac Signs: ధన త్రయోదశికి కొనుగోలు చేసిన వస్తువులు.. మీ రాశి ప్రకారం ఏ దిక్కున పెడితే మంచిదో తెలుసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు చూద్దాం.

ఐదు రోజుల పాటు జరుపుకునే దీపావళి ఉత్సవాలు ధన త్రయోదశితో ప్రారంభం అవుతాయి. దీన్నే ధన్ తేరాస్ అని కూడా పిలుస్తారు. ధన త్రయోదశి రోజు కొత్త బట్టలు ధరించి, పూజలు చేస్తారు. అదే రోజు బంగారం, వెండి ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేస్తే శుభం కలుగుతుందని భావిస్తుంటారు. అయితే ధన త్రయోదశికి కొనుగోలు చేసిన వస్తువులు.. మీ రాశి ప్రకారం ఏ దిక్కున పెడితే మంచిదో తెలుసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

* మేషం
ఈ రాశివారు ధన త్రయోదశి నాడు కొనుగోలు చేసిన వస్తువులను ఇంటి వాయువ్య దిశలో పశ్చిమ భాగంలో ఉంచడం మంచిది.

* వృషభం
ఈ రాశివారు కూడా ధన త్రయోదశికి కొనుగోలు చేసిన వస్తువులను ఇంటికి వాయువ్య దిశలో ఉంచాలి.

* మిథునం
మిధున రాశివారు ధన త్రయోదశి రోజు కొనుగోలు చేసిన వస్తువులను ఇంటి ఉత్తర భాగంలో ఉంచడం మంచిది.

* కర్కాటకం
ఈ రాశివారు ధన త్రయోదశికి కొనుగోలు చేసిన వస్తువులను ఈశాన్య మూలలో.. ఉత్తరం వైపు ఉంచితే మంచిది.

* సింహరాశి
ఈ రాశివారు ధన్ తేరాస్‌ సందర్భంగా కొనుగోలు చేసిన వస్తువులను ఇంటికి ఈశాన్య మూలలో.. అది కూడా తూర్పువైపు ఉంచడం వల్ల మంచి జరుగుతుంది.

* కన్యా రాశి
కన్యారాశి వారు ధన త్రయోదశి రోజు కొనుగోలు చేసిన వస్తువులను ఇంటికి తూర్పు దిశలో ఉంచాలి.

* తుల
ఈ రాశివారు ధన్ తేరాస్ నాడు కొన్న వస్తువులను ఇంటి ఆగ్నేయ మూలలో.. తూర్పు భాగంలో ఉంచాలి.

* వృశ్చికం
వృశ్చిక రాశివారు ధన త్రయోదశికి కొనుగోలు చేసిన వస్తువులను ఇంటి ఆగ్నేయ మూలలో, దక్షిణం వైపు ఉంచాలి.

* ధనస్సు
ఈ రాశివారు ధన త్రయోదశి రోజు కొనుగోలు చేసిన వస్తువులను ఇంటికి దక్షిణ దిశలో పెట్టాలి.

* మకరం
మకరరాశి వారు ధన్ తేరాస్‌కు కొన్న వస్తువులను ఇంటికి నైరుతి దిక్కున ఉంచాలి.

* కుంభం
ధన్ తేరాస్‌లో కొనుగోలు చేసిన వస్తువులను కుంభ రాశివారు ఇంటికి నైరుతి దిశలో పడమర వైపు ఉంచాలి.

* మీనం
ఈ రాశి వారు కొనుగోలు చేసిన వస్తువులను ఇంటికి పశ్చిమ దిశలో ఉంచడం వల్ల లాభాలు కలుగుతాయట.

ఇది కూడా చదవండి : దీపావళికి చిటికెలో రెడీ అయిపోయే 9 టేస్టీ స్వీట్స్.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా..  

వాస్తు శాస్త్రం కేవలం ఇంటి నిర్మాణానికే కాదు. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలనేది కూడా సూచిస్తుంది. ఎలాంటి వస్తువులను ఏ దిక్కున ఉంచాలి.. ఏ మూలన ఎలాంటి వస్తువులు ఉంచకూడదో కూడా వాస్తులో స్పష్టంగా పేర్కొన్నారు. అందుకే కొన్ని మూలల్లో బరువులు పెట్టవద్దని నిపుణులు సూచిస్తారు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Dhanteras 2021, Vastu Tips, Zodiac signs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు