హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Numerology (మార్చి 3): నంబర్‌ 3, 7తో జన్మించిన వారికి బెస్ట్‌ పేరెంట్స్‌ ఉంటారు.. 8తో రిలేషన్‌ యావరేజ్‌!

Numerology (మార్చి 3): నంబర్‌ 3, 7తో జన్మించిన వారికి బెస్ట్‌ పేరెంట్స్‌ ఉంటారు.. 8తో రిలేషన్‌ యావరేజ్‌!

Numerology

Numerology

Numerology Today:(పూజా జైన్ - న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890) వివాహ సంబంధాలు, వ్యాపార ఒప్పందాల వంటి పనుల్లో న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ల మధ్య అనుకూలత చూసుకోవాలని చెబుతున్నారు. 3వ నంబర్‌కి అధిపతి బృహస్పతి. ఈ అంకె నంబర్‌ 7, నంబర్‌ 8తో ఎంత అనుకూలంగా ఉంటుంది, వీటి కలయిక ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Visakhapatnam

Numerology:పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. ఆ సంఖ్యల ఆధారంగా సంబంధిత వ్యక్తులకు ఎదురుకాబోయే ప్రమాదాలు, శుభాలను న్యూమరాలజీ (Numerology) నిపుణులు అంచనా వేస్తుంటారు. కొన్ని అంకెలు ఇతర అంకెలతో కలిసినప్పుడు అనుకూల ఫలితాలు ఇస్తాయి. మరికొన్ని నంబర్‌ల కలయిక కుదరదు. ఇలాంటి అనుకూలతలను పట్టించుకోకపోతే చెడు ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

3వ అంకె అధిపతి బృహస్పతి:

వివాహ సంబంధాలు, వ్యాపార ఒప్పందాల వంటి పనుల్లో న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ల మధ్య అనుకూలత చూసుకోవాలని చెబుతున్నారు. 3వ నంబర్‌కి అధిపతి బృహస్పతి. ఈ అంకె నంబర్‌ 7, నంబర్‌ 8తో ఎంత అనుకూలంగా ఉంటుంది, వీటి కలయిక ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

నంబర్ 7:

నంబర్‌ 7 చాలా ప్రత్యేకమైంది. సూపర్ నేచురల్ పవర్ వంటి ఆధ్యాత్మికత, జ్ఞానం అపారమైన బలం ఉంటాయి. 7 కేతు గ్రహాన్ని సూచిస్తుంది. విశ్లేషణాత్మక నైపుణ్యాలు, తెలివితేటలతో నిండి ఉంది. అదే విధంగా 3వ అంకె, జ్ఞానం, వివేకం వంటి సారూప్య నైపుణ్యాలకు ప్రతినిధి. కాబట్టి ఈ రెండు అంకెలను కలిగి ఉన్న వ్యక్తి భారీ విజయం, ప్రశంసలను అందుకుంటారు. ఈ కలయికతో పనిచేసే భాగస్వాములు అన్ని నిర్ణయాలను హేతుబద్ధంగా అర్థం చేసుకుంటారు, తద్వారా వ్యాపారంలో నష్టాలు కనిష్ట స్థాయికి తగ్గుతాయి. ఈ రకమైన ప్రభావంతో ఉన్న జంటలు మెచ్యూర్‌, ప్రాక్టికల్‌ థింకర్స్‌గా ఉంటారు. వారు పార్ట్‌నర్స్‌కి అవసరమైన స్పేస్‌ ఇస్తారు. సాధారణంగా పరస్పర ప్రయోజనాలు పొందే లక్ష్యంతో ఉంటారు. వారు హేతుబద్ధంగా ఆలోచించేవారు కాబట్టి, వారి భావావేశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి లవ్‌ రిలేషన్‌లో ఎమోషనల్‌ అటాచ్‌మెంట్‌ తక్కువగా ఉంటుంది. వ్యక్తి పుట్టిన తేదీలో 7, 3 కనిపిస్తే గొప్ప విలువ పొందుతారు. ఎందుకంటే అతనికి చివరి వరకు సపోర్ట్‌గా నిలిచే తల్లిదండ్రులు ఉంటారు. ఈ అంకెల ప్రభావం లేని వ్యక్తులు తల్లి లేదా తండ్రితో రిలేషన్‌ కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

నంబర్‌ 8:

8వ నంబర్‌, 3వ నంబర్‌ మధ్య రిలేషన్‌ సాధారణంగా ఉంటుంది. 8 అనేది హార్డ్‌ వర్క్‌, జడ్జిమెంట్‌ గురించి అయితే, 3 కేవలం ప్రతిభ, వ్యక్తీకరణలకు సంబంధించినది. ఇద్దరూ తటస్థంగా పని చేస్తారు. ఇతరుల వ్యాపారంలో కనీస ఆసక్తిని కలిగి ఉంటారు. ఈ కలయికతో ఉన్న వ్యాపార భాగస్వాములు తమ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. వృత్తిలో ఆర్థిక ప్రయోజనాల కోసం వారి విస్తృత కుటుంబ కనెక్షన్‌ని ఉపయోగించాలి. ఈ నంబర్‌లతో ఉన్న జంటలు సోషల్ నెట్‌వర్కింగ్‌ని గరిష్టంగా ఉపయోగించడం నేర్చుకోవాలి. తులసి మొక్కను ఇంట్లో ఉంచడం తప్పనిసరి. తులసి మొక్క ముందు దీపం వెలిగించడం వల్ల ప్రభావం పెరుగుతుంది. శాస్త్రాలు, రాజకీయాలు, ఫైనాన్స్, జ్యోతిష్యం, కన్సల్టెన్సీలు, వైద్య రంగాలు అదృష్టాన్ని, విజయాన్ని రుజువు చేస్తాయి. 3, 8వ అంకెలు కలిగిన స్త్రీలు వ్యాయామం, ధ్యానంలో పాల్గొనాలి.

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)

First published:

Tags: Astrology, Horoscope, Numerology

ఉత్తమ కథలు