పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. ఆ సంఖ్యల ఆధారంగా సంబంధిత వ్యక్తులకు ఎదురుకాబోయే ప్రమాదాలు, శుభాలను న్యూమరాలజీ (Numerology) నిపుణులు అంచనా వేస్తుంటారు. కొన్ని అంకెలు ఇతర అంకెలతో కలిసినప్పుడు అనుకూల ఫలితాలు ఇస్తాయి. మరికొన్ని నంబర్‌ల కలయిక కుదరదు. ఇలాంటి అనుకూలతలను పట్టించుకోకపోతే చెడు ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
2కు అధిపతి చంద్రుడు:
వివాహ సంబంధాలు, వ్యాపార ఒప్పందాల వంటి పనుల్లో న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ల మధ్య అనుకూలత చూసుకోవాలని చెబుతున్నారు. 2వ నంబర్‌కి అధిపతి చంద్రుడు. ఈ అంకె నంబర్ 4, నంబర్ 5తో ఎంత అనుకూలంగా ఉంటుంది, వీటి కలయిక ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నంబర్ 4:
నంబర్ 2కి అధిపతి చంద్రుడు, నంబర్ 4కి అధిపతి యురేనస్. వీటి రెండింటి మధ్య అనుబంధం మంచిది. శాంతియుతంగా జీవించడానికి సహాయపడుతుంది. 2వ అంకెలో జన్మించిన వారు హోమ్ లవింగ్, షై, సెన్సిటివ్, ఇమేజినేటివ్, డిప్లమేటిక్. అదే విధంగా నంబర్ 4లో జన్మించిన వారు రిజర్వ్‌డ్, ప్రాక్డికల్, ఇంటెలిజెంట్, ఆర్గనైజ్డ్‌గా ఉంటారు. అందువల్ల ఈ సంఘంలోని వ్యక్తుల జీవితాలు చాలా సాఫీగా ఉంటాయి ఎందుకంటే 4వ అంకెకు చెందిన వ్యక్తులు తెలివైనవారు, బలంగా ఉంటారు. 2లోని వ్యక్తులు రొమాంటిక్‌గా, ఆధ్యాత్మికంగా ఉంటారు. 4కి చెందిన వారు ప్రాక్టికల్‌గా ఉంటారు. అందువలన ఇది అద్భుతమైన కలయిక అవుతుంది. ఈ అనుబంధం చాలా సౌకర్యాన్ని కలిగిస్తుంది.
నంబర్ 4కి చెందిన వ్యక్తులు కుటుంబంలో కీలకంగా ఉంటారు. భద్రతను పర్యవేక్షిస్తారు. ఈ లక్షణాలన్నీ 2వ నంబర్‌లోని వ్యక్తులను బాగా ఆకర్షిస్తాయి. ఏదో ఒకవిధంగా అవగాహన వీరి మధ్య సమస్యగా మారుతుంది. 4లోని వ్యక్తులు అంత ఎక్స్‌ప్రెసివ్ కాదు, నంబర్ 2కి చెందిన వ్యక్తులు ప్రేమను చూపించాలని భావిస్తారు. 4 కొంచెం ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండటానికి ప్రయత్నించాలి. వీరి మధ్య భావోద్వేగ, ఆర్థిక భద్రత పరంగా ఒకరికొకరు అందించడానికి చాలా ఉన్నాయి. 4 సాధారణంగా స్థిరమైన నిత్యకృత్యాలను కలిగి ఉంటుంది. ఇది కొన్నిసార్లు 2లోని వ్యక్తులకు విసుగు తెప్పిస్తుంది. కాబట్టి 4 జీవితంలో మరింత స్పాంటేనియస్‌గా ఉండాలి. ఇది ఇద్దరి మధ్య రొమాంటిక్ రిలేషన్‌ను మెరుగుపరుస్తుంది.
నంబర్ 5:
నంబర్ 5కి అధిపతి బుధుడు. 2కి చెందిన వ్యక్తులు నిజాయితీగా, సున్నితంగా, విధేయులుగా, సౌమ్యంగా ఉంటారు. 5లో జన్మించిన వాళ్లు చంచలంగా ఉంటారు. నంబర్ 1లోని వ్యక్తులు ఇంటిని ప్రేమించేవారు, నిబద్ధతతో ఉంటారు. అయితే నంబర్ 5కి చెందిన వాళ్లు వ్యక్తులు స్వేచ్ఛ, సాహసాన్ని ఇష్టపడతారు. అదేవిధంగా 2లోని వ్యక్తులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. 5వ అంకె రొమాంటిక్, ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఈ అసోసియేషన్‌లోని వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే ఇద్దరికీ విరుద్ధమైన లక్షణాలు ఉంటాయి. ఈ సంబంధానికి భాగస్వామి అవసరాలను అర్థం చేసుకోవడం, సర్దుబాటు చేసుకోవడం చాలా ముఖ్యం.
2కి కుటుంబం పై కోరిక ఉంటుంది. వారికి ప్రేమ, శ్రద్ధ కావాలి. మరోవైపు 5లోని వ్యక్తులు పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం వెతుకుతారు. వ్యతిరేక స్వభావాలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టకుండా ఉండాలంటే ఈ సంబంధంలో కెమిస్ట్రీ చాలా బలంగా ఉండాలి. ఇది సరైన అవగాహనతో గొప్ప సంబంధం కావచ్చు. కానీ ఇది కష్టతరమైన రహదారి అవుతుంది. ఈ రెండు సంఖ్యల మధ్య రిలేషన్ ఆపోజిట్ పోల్స్ ఎలా ఆకర్షిస్తాయి అనేదానికి మంచి ఉదాహరణ . ఈ రెండు సంఖ్యలు ఒకదానికొకటి పరస్పర గౌరవాన్ని కలిగి ఉంటాయి, అవి స్నేహితులుగా, ప్రేమికులుగా, విజయవంతమైన వ్యాపార భాగస్వామ్యం గా నిలుస్తాయి.
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Horoscope, Numerology