హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Numerology: న్యూమరాలజీ ప్రకారం.. ఏదైనా నెలలో 5వ తేదీన పుట్టిన వారు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

Numerology: న్యూమరాలజీ ప్రకారం.. ఏదైనా నెలలో 5వ తేదీన పుట్టిన వారు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తులపై ప్రభావం పడుతుంది. ఏదైనా నెలలో 5వ తేదీన పుట్టినవారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.

న్యూమరాలజీ(Numerology) ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తులపై ప్రభావం పడుతుంది. ఏదైనా నెలలో 5వ తేదీన పుట్టినవారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం. నంబర్ 5 అనేది బుధ గ్రహానికి (మెర్క్యురీకి) చెందినది. ఈ తేదీన జన్మించిన వ్యక్తులపై బుధుడి(Mercury) ప్రభావం ఉంటుంది. నంబర్ 5 వైవిధ్యత, బహుముఖ ప్రజ్ఞ, తెలివితేటలకు ప్రతిరూపం. ఈ సహజమైన సామర్థ్యంతో చాలా మందికి కలలు కనే అపరిమితమైన స్వేచ్ఛ లభిస్తుంది. వీరికి ప్రధాన సమస్య ఒకటి ఉంది. వీరు ఎల్లప్పుడూ తమ ప్రతిభకు తగ్గట్లు నిజంగా కోరుకునే పనిని పూర్తిచేసి ఫలితం పొందలేరు. తమ జీవిత ప్రయాణంలో వివిధ కార్యకలాపాలను ఎక్కువ కాలం కొనసాగించలేరు. ఫలితంగా వృత్తిలో కూడా మార్పు వస్తుంది. అంటే వీరు తరచుగా ప్రొఫెషన్ మార్చుకునే అవకాశం ఉంది.

వారిలో ఎక్కువ మంది ప్రయాణాలను ఇష్టపడతారు. సాహసోపేతంగా ఉంటూ అడ్వెంచర్స్ అంటే ప్రాణం ఇస్తారు. ఒక నిర్దిష్ట పనిని, రంగాన్ని ఎంచుకోవడం అనేది వీరికి చాలా కష్టం. ఎందుకంటే వీరు ప్రతిసారి తమ పనితో విరక్తి చెంది, మార్పును కోరుకుంటారు. వీరు ప్రతిసారి ఊహించని అవకాశాలను పొందుతారు కాబట్టి, ఈ విషయంలో వీరికి అపారమైన అదృష్టం ఉంటుంది.

Jobs in Telangana: రంగారెడ్డి జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

వీరు అన్ని విషయాల్లో ఆచితూచి ఆలోచిస్తూ ప్రాక్టికల్ డిసీజన్స్ తీసుకుంటారు. నిర్ణయాలు అత్యంత విశ్లేషణాత్మకంగా ఉంటాయి. లోన్ తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తారు. డబ్బు సంపాదించే గొప్ప ఆలోచనలు కలిగి ఉంటారు. రొమాంటిక్‌గా, హార్ట్‌ఫుల్‌ వ్యక్తులుగా, మనోహరంగా (చార్మింగ్‌గా) ఉంటూ అప్పీయరెన్స్‌తో బాగా ఆకట్టుకుంటారు. రిస్క్ భరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం వీరికి అలవాటు. డబ్బును ఎలా రెట్టింపు చేయాలో కూడా వీరికి తెలుసు.

Numerology: వీరికి ఆకస్మిక ధనలాభం.. మద్యానికి దూరంగా ఉంటే మంచిది.. మే 4 న్యూమరాలజీ


అయితే జీవితం పట్ల వీరి ధైర్యమైన వైఖరి ఇతరులను బాధపెట్టడానికి కారణం అవుతుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జీవిత సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి వీరు ఎల్లప్పుడూ ఆకుపచ్చ, లేత రంగుల దుస్తులను ధరించాలి. తమ జీవితం నుంచి దాదాపు అన్ని విషయాలను పొందుతారు. కానీ అదే సమయంలో చిన్న చిన్న వైఫల్యాలను మేనేజ్ చేయడం కూడా నేర్చుకోవాలి. నటన, ప్రయాణం, పర్యటనలు, వైమానిక దళం, సైన్యం, పోలీసు సేవలు, క్రీడలు, రాజకీయ ప్రకటనలు, వైద్యులు.. వంటివి వారికి అదృష్టవంతమైన కెరీర్‌ ఆప్షన్లు.

* అదృష్ట రంగులు - ఆకుపచ్చ, తెలుపు

* లక్కీ డే - బుధవారం

* లక్కీ నంబర్ - 5, 6

విరాళాలు: పేదలకు ఆకుపచ్చ రంగు దుస్తులు లేదా ఆకుపచ్చని ఆకులతో కూడిన ఆహారాన్ని దానం చేయండి.

* లిక్కర్, నాన్ వెజ్‌ ఫుడ్స్, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండండి.

* డబ్బు సంపాదించడం కోసం షార్ట్ కట్స్ మానుకోండి.

* అన్ని బుధవారాలు వినాయకుడి గుడికి తప్పకుండా వెళ్లండి.

First published:

Tags: Astrology, Numerology, Zodiac signs

ఉత్తమ కథలు