హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Numerology: (ఫిబ్రవరి 1) ఆల్ఫాబెట్ Tతో పేరు ఉన్నవారు చాలా స్పెషల్.. వీరి ప్రత్యేకతలు ఇవే..

Numerology: (ఫిబ్రవరి 1) ఆల్ఫాబెట్ Tతో పేరు ఉన్నవారు చాలా స్పెషల్.. వీరి ప్రత్యేకతలు ఇవే..

Numerology

Numerology

Numerology Today:(పూజా జైన్ - న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890) ఇంగ్లీష్ అక్షరం Tతో పేరు మొదలయ్యే వ్యక్తులకు ప్రత్యేక లక్షణాలు ఉంటాయని న్యూమరాలజీ చెబుతోంది. మీ పేరు కూడా ఇదే అక్షరంతో మొదలైతే, మీ గురించి న్యూమరాలజీ ఏం చెబుతోందో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Visakhapatnam

Numerology:న్యూమరాలజీ మొత్తం నంబర్ల చుట్టూ తిరుగుతుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఒక్కో తేదీన పుట్టిన వారిపై నిర్ధిష్ట సంఖ్యల ప్రభావం ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగానే పిల్లలకు పేరు పెట్టాలని న్యూమరాలజీ చెబుతోంది. అయితే ఇంగ్లీష్ అక్షరం Tతో పేరు మొదలయ్యే వ్యక్తులకు ప్రత్యేక లక్షణాలు ఉంటాయని ఈ శాస్త్రం చెబుతోంది. మీ పేరు కూడా ఇదే అక్షరంతో మొదలైతే, మీ గురించి న్యూమరాలజీ ఏం చెబుతోందో తెలుసుకోండి.

ఆల్ఫాబెట్స్ Tతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు వారి పనులు, ఫలితాలతో పూర్తిగా సంతృప్తి చెందుతారు. తెలివైన మార్గాల ద్వారా విజయాన్ని కోరుకుంటారు. తమ సామర్థ్యంపై పూర్తి నమ్మకంతో ముందుకు వెళ్తారు. అలాగే స్వతంత్రంగా, నిర్ణయాత్మకంగా ఉంటారు. తమ లక్ష్యాల గురించి ఏమాత్రం ఆందోళన చెందరు. ఈ విషయంలో గందరగోళానికి తావు ఇవ్వకుండా, స్పష్టంగా ఉంటారు. తాము నిర్దేశించుకున్న సూత్రాలు, ఆశయాలకు కట్టుబడి ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఐడియాలజీ విషయంలో రాజీపడరు.

ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు ఒక గ్రూప్‌లో ప్రత్యేకంగా, మెరిసే సూర్యుడిలా ప్రకాశవంతంగా కనిపిస్తారు. అందరి దృష్టిలో పడుతూ.. సక్సెస్‌ఫుల్ లీడర్‌గా ప్రత్యేకత చాటుకుంటారు.

ప్రత్యేక లక్షణాలు:

వీరికి తమ మతంపై గట్టి నమ్మకం ఉంటుంది. అయితే వీరి ఆధ్యాత్మికత వివిధ రూపాల్లో ఉండవచ్చు. వాస్తవానికి వీరు సంప్రదాయ ఆచారాలకు కట్టుబడి ఉండరు. కానీ తమ దేశానికి మానవత్వానికి, దేవునికి విధేయులుగా ఉంటారు. ఒక రకమైన ఉదారమైన, దయగల ప్రవర్తన కారణంగా వారి వ్యక్తిత్వం ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంది. వీరు ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఇతరులకు సహాయం చేయాలని భావిస్తారు, అది వారిని స్పెషల్ పర్సన్‌గా నిలబెడుతుంది.

మహిళలకు ఇలా:

ఆల్ఫాబెట్స్ Tతో పేరు మొదలయ్యే మహిళలు చాలా ప్రతిభావంతులు. వీరి క్రియేటివిటీ అపారం. టీచింగ్, రైటింగ్, డైరెక్షన్, పెయింటింగ్, డ్యాన్సింగ్, చెఫ్.. వంటి రంగాల్లో బాగా రాణిస్తారు. కౌన్సెలింగ్, ఫైనాన్స్ ఎడ్యుకేషన్ , ట్రైనింగ్, పాలిటిక్స్, యానిమేటియో రంగాల్లో అద్భుతంగా పనిచేస్తారు.

కంపెనీలు:

ఇంగ్లీష్ Tతో పేరు ప్రారంభమయ్యే కంపెనీలు ఉత్పత్తి రంగం కంటే సేవా రంగంపైనే ఎక్కువ దృష్టి సారించి సక్సెస్ అవుతాయి. స్పోర్ట్స్ వంటి సెక్టార్ల కంటే యానిమేషన్ ఇండస్ట్రీ వంటి క్రియేటివ్ ఆర్ట్స్‌ ఈ కంపెనీలను విజయ తీరాలకు చేరుస్తాయి. ఈ అక్షరం, తీర్థంకరుల వంటి గొప్ప ఆధ్యాత్మిక నాయకులను తయారు చేస్తుందని న్యూమరాలజీ చెబుతోంది.

వీరికి అదృష్ట రంగులు- బ్లూ, వైట్

లక్కీ డే- సోమవారం

విరాళాలు- ఆశ్రమాలకు లేదా పేదలకు పాలు లేదా తెల్లని స్వీట్లను దానం చేయండి

ఇల్లు లేదా ఆఫీస్ తూర్పు గోడకు వైండ్ చిమ్స్, ఫౌంటెన్ వంటి ఫ్లోటింగ్ వస్తువులను ఉంచండి.

First published:

Tags: Astrology, Numerology

ఉత్తమ కథలు