Numerology: పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. ఆ సంఖ్యల ఆధారంగా సంబంధిత వ్యక్తులకు ఎదురుకాబోయే ప్రమాదాలు, శుభాలను న్యూమరాలజీ (Numerology) నిపుణులు అంచనా వేస్తుంటారు. కొన్ని అంకెలు ఇతర అంకెలతో కలిసినప్పుడు అనుకూల ఫలితాలు ఇస్తాయి. మరికొన్ని సంఖ్యల కలయిక కుదరదు. ఇలాంటి అనుకూలతలను పట్టించుకోకపోతే చెడు ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
4వ నంబర్ 8, 9 మధ్య అనుకూలత:
వివాహ సంబంధాలు, వ్యాపార ఒప్పందాల వంటి పనుల్లో నంబర్ల మధ్య అనుకూలత చూసుకోవాలని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు. నంబర్ 4కి అధిపతి రాహువు. ఈ అంకె నంబర్ 8, నంబర్ 9తో ఎంత అనుకూలంగా ఉంటుంది, వీటి కలయిక ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నంబర్ 8:
సంస్థలో ఉన్నత స్థాయిలో పనిచేసే వ్యక్తులకు అటువంటి కఠినమైన అంకెల కలయిక ఉంటుంది. 4వ నంబర్, 8వ నంబర్ కలయికతో స్ట్రాటెజిక్ లెవల్‌లో మేనేజ్‌మెంట్ పొజిషన్, డిసిప్లైన్, కంట్రోల్, ఆర్డర్ మేనేజ్‌మెంట్ వంటి జాబ్‌లు, కఠినమైన వైఖరిని కోరుకునేలా చేస్తాయి. ఈ అంకెలలో దేనినైనా కలిగి ఉన్న భాగస్వాముల గురించి మాట్లాడితే, ముందుగా ఇద్దరిలో ఎవరు పర్ఫెక్షనిస్ట్? అనే ప్రశ్న ముందుకు వస్తుంది.
వీరు వాదనలకు దూరంగా ఉన్నప్పటికీ, జడ్జిమెంట్ వారి బలహీనత అవుతుంది. ఇది కృషి, త్యాగాల తర్వాత చాలా డబ్బు, ఆదాయంతో కఠినమైన జీవితాన్ని ఇస్తుంది. వారు తమ జీవితాన్ని సామాజిక సహాయం, దాతృత్వం, ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆధ్యాత్మికత, ఉన్నత స్థాయి విద్య కోసం అంకితం చేయడం నేర్చుకోవాలి. అలాంటి వ్యక్తిత్వాలలో అత్యుత్తమ భాగం ఏంటంటే, వారు ఎల్లప్పుడూ పనులను పూర్తి చేస్తారు, అసంపూర్తిగా వదిలేయరు. కాబట్టి పర్యవేక్షణ నష్టాలు దాదాపు ఉండవు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. భోజనంలో సిట్రస్ ఉండే పదార్థాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
ఇంలాంటి కలయికలతో ఉన్న జంటలు సంతోషకరమైన, సుసంపన్నమైన భవిష్యత్తు కోసం రిలేషన్‌లో భావోద్వేగాలు, మనోభావాలను చేర్చాలి. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, మెటల్, తయారీ, యంత్రాలు, వ్యవసాయం, వైద్యం, ఫైనాన్స్, వుడ్, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ గుడ్డిగా స్వీకరించవచ్చు. 4, 8వ నంబర్‌ల కలయిక ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రఖ్యాత రాజకీయ నాయకులను తయారు చేసింది. ఈ కలయితో జన్మించిన వారు బెస్ట్ కెరీర్‌ను పొందుతారు.
లక్కీ కలర్స్: గ్రీన్, బ్లూ
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్: 6
పరిహారం: దయచేసి ఆకు కూరలను పశువులకు లేదా పేదలకు దానం చేయండి
నంబర్ 9:
నంబర్ 9 పర్ఫెక్ట్ నంబర్. ఇది 4వ అంకెకు అదృష్టం, విధేయతను అందిస్తుంది. ఈ రెండు నంబర్‌ల మధ్య ఎప్పుడూ ఆకర్షణ ఉంటుంది, ఉత్తమ ఫలితం కోసం నిరంతరం పని చేస్తుంటాయి. వీటి మధ్య ఎల్లప్పుడూ ఆకర్షణ ఉంటుంది. 4లో జన్మించిన వారు తరచుగా 9ని ఎదుర్కొంటారు. ఉదాహరణకు వెహికల్ నంబర్ లేదా హౌస్ నంబర్‌లో అంకెల మొత్తం 9 వస్తుంది. 4, 9 ఎల్లప్పుడూ ఒకే దగ్గర ఉండాలని సిఫార్సు చేస్తారు, తద్వారా వారి బలహీనతలను అధిగమించవచ్చు.
ఈ పుట్టిన తేదీని కలిగి ఉన్న జంటలు అత్యుత్తమ, నిజాయితీ, విశ్వసనీయ, ఆకట్టుకునే, ప్రేమగల జంటలుగా ఉంటారు. ఈ రెండు అంకెలు రాహువు, మంగళ మంత్రాన్ని జపించడానికి మొగ్గు చూపాలి. యోగా లేదా జిమ్ వంటి శారీరక వ్యాయామాలలో కఠినంగా పాల్గొనాలి. టమోటా, దానిమ్మ వంటి ఎర్రటి పండ్లు వారి మానసిక, శారీరక ఆరోగ్యానికి అవసరం. పరిశ్రమలకు ఆర్థిక సలహాలు, విద్య, స్టాక్ మార్కెట్, యంత్రాలు, గ్యాస్ వెసెల్స్, అడ్వైజరీ, క్రీడలు వారి విధిని వారి అదృష్టం వైపు మళ్లించగలవు. అలాంటి కలయికలు ఉన్న స్త్రీలు ధ్యానం, హీలింగ్, మెడిటేషన్‌లో సమయం గడపాలి. లేకపోతే కొంతమంది వారి జీవిత భాగస్వాములకు ఇబ్బందిగా మారతారు.
లక్కీ కలర్స్: రెడ్, పర్పుల్
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్: 9
పరిహారం: దయచేసి అనాథాశ్రమంలో పుచ్చకాయను దానం చేయండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Horoscope, Numerology