Numerology: పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. ఆ సంఖ్యల ఆధారంగా సంబంధిత వ్యక్తులకు ఎదురుకాబోయే ప్రమాదాలు, శుభాలను న్యూమరాలజీ (Numerology) నిపుణులు అంచనా వేస్తుంటారు. కొన్ని అంకెలు ఇతర అంకెలతో కలిసినప్పుడు అనుకూల ఫలితాలు ఇస్తాయి. మరికొన్ని నంబర్‌ల కలయిక కుదరదు. ఇలాంటి అనుకూలతలను పట్టించుకోకపోతే చెడు ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
5వ అంకె 8, 9 మధ్య అనుకూలత:
వివాహ సంబంధాలు, వ్యాపార ఒప్పందాల వంటి పనుల్లో న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ల మధ్య అనుకూలత చూసుకోవాలని చెబుతున్నారు. నంబర్ 5 అనేది.. 8, 9 సంఖ్యల్లో దేనితో ఎంత అనుకూలంగా ఉంటుంది, వీటి కలయిక ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం.
నంబర్ 8:
8వ నంబర్ న్యాయాన్ని సూచిస్తుంది. బిజీ, హార్డ్‌వర్క్‌ను డిమాండ్ చేస్తుంది. ఈ అంకె వాస్తవంగా ఉంటుంది, ఇతరులకు సహాయం చేసే వైఖరిని కలిగి ఉంటుంది. కానీ జీవితంలో విజయాన్ని పొందడానికి సవాళ్లు, అడ్డంకులను ఎదుర్కొంటారు. 8కి నంబర్ 5 పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే వారిద్దరికీ ఒకరికొకరి సపోర్ట్ అవసరం.
స్మార్ట్ వర్కింగ్ విషయానికి వస్తే.. 8 ఇందుకు సరైనది కాదు, దీనికి అవసరమైన అదృష్టాన్ని 5 అందిస్తుంది, అపారమైన సౌకర్యాన్ని ఇస్తుంది, అందువల్ల పనిలో కష్టం తగ్గుతుంది. జ్ఞానం అవసరం, సంభావ్యత అవసరమైన చోట 8 చాలా వరకు 5కి సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి ఇద్దరూ కలిసి తమ ఇండస్ట్రీలో ఉన్నత స్థానాలు అందుకోవడానికి చేతులు కలపవచ్చు.
అటువంటి కలయికలతో వ్యాపారవేత్తలు సాధారణంగా విజయవంతమవుతారు. కార్పొరేట్ ఉద్యోగులు వారి సహచరుల కంటే చాలా సులభంగా ఎదుగుతారు. పబ్లిక్ ఈవెంట్‌ల వ్యాపారం, స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, స్పాన్సర్‌షిప్, ఆహారం, మార్కెటింగ్, డెకర్, ఎలక్ట్రికల్స్ , ప్రాపర్టీ వ్యాపారంలో గరిష్టంగా 5, 8 ప్రభావాన్ని ఉపయోగించుకోవాలి. 8వ తేదీ లేదా 26వ తేదీలలో జన్మించిన వారు ఎటువంటి సందేహం లేకుండా మొబైల్ నంబర్‌లో అంకెల మొత్తం 5 ఉండేలా చూసుకోండి.
లక్కీ కలర్: టీల్
లక్కీ డే: బుధవారం
లక్కీ నంబర్: 5
పరిహారం: దయచేసి యాచకులకు బూట్లు దానం చేయండి
నంబర్ 9:
9వ నంబర్ అనేది కీర్తి లేదా పాపులారిటీని సూచిస్తుంది. ఇది ప్రముఖులు లేదా పబ్లిక్ ఫిగర్లకు చెందిన అంకె. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా 9వ అంకెను 5 ప్రోత్సహిస్తుంది. 5, 9కి చెందిన ఇద్దరూ ఆనందిస్తారు. వీరి రిలేషన్ యావరేజ్‌గా ఉంటుంది, దీని వెనుక కారణం చాలా సాధారణమైంది. జీవితాన్ని వారి సొంత మార్గంలో నడిపించాలనేది వారి సెల్ఫ్ సెంట్రిక్ కోరిక. వారు ఏదో ఒక విధంగా ఇతరుల అవసరాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తారు, ఇది మొత్తం పరిస్థితిని డామినేట్ చేస్తుంది.
ఇప్పటికీ 5, 9 బిజినెస్‌లో ఎల్లప్పుడూ కలిసి ఉండగలవు, అయితే అలాంటి కలయికలతో పర్సనల్ రిలేషన్‌లోకి వెళ్లే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఫైనాన్స్, మార్కెటింగ్, ఫెన్స్, జ్యూయలరీ, కన్సల్టెన్సీలు, స్టాక్ మార్కెట్, ప్రాపర్టీతో కూడిన బిజినెస్ అద్భుతమైన రాబడిని ఇస్తుంది.
లక్కీ కలర్: గ్రీన్, బ్రౌన్
లక్కీ డే: బుధవారం. మంగళవారం
లక్కీ నంబర్: 5
పరిహారం: దయచేసి ఆశ్రమాలలో బ్రౌన్ రైస్ దానం చేయండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Horoscope, Numerology