Numerology: పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. ఆ సంఖ్యల ఆధారంగా సంబంధిత వ్యక్తులకు ఎదురుకాబోయే ప్రమాదాలు, శుభాలను న్యూమరాలజీ (Numerology) నిపుణులు అంచనా వేస్తుంటారు. పిల్లలకు పుట్టిన తేదీలోని అంకెల ఆధారంగా ఆల్ఫాబెట్ సెలక్ట్ చేసుకుని పేరు పెడితే మేలు జరుగుతుందని తెలిపారు. ఆ ప్రభావంతో ఉన్నత స్థానాలు అందుకుంటారని, కీర్తి, ప్రతిష్టలు దక్కుతాయని వివరించారు. ఇప్పుడు ఆల్ఫాబెట్ Wతో పేరు మొదలయ్యే వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
ఆల్ఫాబెట్ W:
ఇంగ్లీషు లెటర్ Wతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు కష్టపడి పనిచేస్తారు. వారు రిస్క్ తీసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు, అందులోనే అభివృద్ధి చెందుతారు. స్కూబా డైవింగ్, పారా జంపింగ్, మోటార్ రేసింగ్, లాంగ్ జంప్‌లు, హై జంప్‌లు వంటి వాటిని ఎక్కువగా సెలక్ట్ చేసుకుంటారు. Wతో పేరు మొదలయ్యే వాళ్లు వినయంగా ఉంటారు కానీ చాలా చురుకుగా ఉంటారు. కష్టమైన పనులను స్వీకరించడానికి వెనుకాడరు. అస్సలు విశ్రాంతి తీసుకోకుండా, విరామం లేకుండా పగలు, రాత్రులు నిరంతరం పని చేయగలరు. ఆశయం లేదా లక్ష్యాల పట్ల వారి అంకితభావం వారిని ఉన్నతంగా ఎదగడానికి దారితీస్తుంది. చివరకు వారి కలలను సాకారం చేసుకునేలా చేస్తుంది. వృద్ధాప్యంలో చింతలు, బాధలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు వారు అసైన్‌మెంట్‌లు, ప్రామిసెస్‌లతో నిండిన జీవితాన్ని గడుపుతారు.
సొంత వాళ్లకు సమయం కేటాయించలేరు:
ఆల్ఫాబెట్ Wతో పేరున్న వాళ్లు తీరిక లేని జీవితం కారణంగా వారు తమ కుటుంబ సభ్యుల నుంచి కంప్లెయింట్ష్ ఎక్కువగా వినాల్సి వస్తుంది. తమ సొంత వాళ్లకు సమయం కేటాయించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆశయం లేదా అభిరుచి కంటే శ్రేయస్సు ముఖ్యమన్న వాస్తవాన్ని వారు నేర్చుకోవాలి. వారు సాధారణంగా ఉదార స్వభావం కలిగి ఉంటారు, నిజమైన దేశభక్తులు. సమాజ సహాయకులుగా ఉంటారు, ఆధ్యాత్మికం వైపు ఆలోచనలు ఉంటాయి. తమ తప్పుల నుంచి తామే నేర్చుకుంటారు. సెల్ఫ్ లెర్నర్స్‌గా గుర్తింపు పొందుతారు. ఆస్తులు లేదా స్టాక్‌లో పెట్టుబడి పెట్టడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉచ్చులో పడేసే అవకాశం ఉంది, ఇతరులను అతిగా నమ్మకండి. డబ్ల్యూ లెటర్‌తో పేరు మొదలయ్యే పురుషులు తయారీ, ఇంజనీరింగ్, ఈవెంట్‌లు, మార్కెటింగ్, బ్రోకరేజ్, క్రీడల వంటి వాటిల్లో రాణిస్తారు. మహిళలు తమ అదృష్టాన్ని గ్లామర్ లేదా మీడియా రంగంలో పరీక్షించుకోవాలి.
పరిహారం
లక్కీ కలర్స్: గ్రీన్, వైట్
లక్కీ డే: బుధవారం
లక్కీ నంబర్: 5
విరాళాలు: దయచేసి పశువులకు లేదా ఆశ్రమాలలో పాలు దానం చేయండి అన్ని బుధవారాలు గణేశ పూజను నిర్వహించండి. అరటి చెట్టుకు చక్కెర నీటిని పోయండి. లెదర్ బెల్ట్, వాచ్ ధరించడం మానుకోండి. పంచ ముఖి రుద్రాక్ష మాలను ధరించండి. దయచేసి నాన్ వెజ్, లిక్కర్, పొగాకు, లెదర్ ప్రొడక్టులకు దూరంగా ఉండండి.
W లెటర్‌తో పేరు ఉన్న ప్రముఖులు: వసీమ్ అక్రమ్, వహీదా రెహ్మాన్
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Horoscope, Numerology