Numerology: పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. ఆ సంఖ్యల ఆధారంగా సంబంధిత వ్యక్తులకు ఎదురుకాబోయే ప్రమాదాలు, శుభాలను న్యూమరాలజీ (Numerology) నిపుణులు అంచనా వేస్తుంటారు. కొన్ని అంకెలు ఇతర అంకెలతో కలిసినప్పుడు అనుకూల ఫలితాలు ఇస్తాయి. మరికొన్ని నంబర్‌ల కలయిక కుదరదు. ఇలాంటి అనుకూలతలను పట్టించుకోకపోతే చెడు ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
2వ అంకె 6, 7 మధ్య అనుకూలత:
వివాహ సంబంధాలు, వ్యాపార ఒప్పందాల వంటి పనుల్లో న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ల మధ్య అనుకూలత చూసుకోవాలని చెబుతున్నారు. 2వ నంబర్‌కి అధిపతి చంద్రుడు. ఈ అంకె నంబర్ 6, నంబర్ 7తో ఎంత అనుకూలంగా ఉంటుంది, వీటి కలయిక ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నంబర్ 6:
2వ నంబర్, 6వ నంబర్ మధ్య విజయవంతమైన రిలేషన్ ఉంటుంది. రెండూ నిబద్ధతను ప్రదర్శించే అంకెలు. అందువల్ల ఈ నంబర్‌లలో జన్మించిన వారి మధ్య వివాహం, వ్యాపార భాగస్వామం ఉత్తమంగా ఉంటుంది. 6 కుటుంబం, స్నేహితుల అనుసంధానంతో సమృద్ధిగా ఉంటుంది. 2 ఆ సంబంధాలను అందంగా మార్చడానికి భావోద్వేగ అంశాలను నిర్మించడానికి ప్రోత్సహిస్తుంది. వీరి మధ్య నిబద్ధత, విధులను కలిగి ఉండే బాధ్యత కనిపిస్తుంది. 2వ అంకెకు చెందిన వారు 6తో పని చేస్తున్నప్పుడు భావోద్వేగ సమతుల్యతను సాధించడం నేర్చుకోవాలి. ఈ రెండు నంబర్‌లు సంఘం, సామాజిక కారణాలు, సంక్షేమం, ప్రభుత్వం, దేశం కోసం గొప్పగా పని చేస్తాయి. 6లో జన్మించిన వారు సొంత లేదా భాగస్వామ్య సంస్థకు అన్ని అక్షరాల మొత్తం 2 వచ్చేలా పేరు పెట్టవచ్చు. అదే విధంగా 2కి చెందిన వారు పాలు, సౌందర్య ఉత్పత్తులు, డెకర్, కమీషనింగ్, రక్షణ సేవలు, వస్త్రాలు, మందులు, ఆభరణాలు, నీరు, చట్టం, ఆహారం వంటి బిజినెస్‌లకు అక్షరాల మొత్తం 6 వచ్చేలా పేరు సెలక్ట్ చేసుకోవచ్చు.
నంబర్ 7:
సాధారణంగా 2, 7వ నంబర్‌ల మధ్య పొత్తు కుదురుతున్నట్లు కనిపిస్తుంది. కానీ వీరి మధ్య ఎల్లప్పుడూ ఆలోచనల వైరుధ్యాలు ఉంటాయి. 7లో జన్మించిన వారు ఎల్లప్పుడూ ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. అయితే 2 ఎల్లప్పుడూ దాని మనసు చేసే సూచనలను అనుసరిస్తుంది, ఈ వైఖరి రిలేషన్‌లో అసంతృప్తిని తీసుకొస్తుంది. అదే సమయంలో 7వ నంబర్, 2వ నంబర్ జీవితంలోని అన్ని దశల్లో ఒకరికొకరు సపోర్ట్‌గా, స్నేహపూర్వకంగా ఉంటాయి. అటువంటి గ్రహాల సమూహంతో లాభాలు, గుడ్‌విల్ పరంగా వ్యాపార భాగస్వాములు బాగా పని చేస్తారు. కానీ 2తో జన్మించిన వ్యక్తులు ఏవైనా పేర్లలో అక్షరాల మొత్తం 7 రాకుండా చూసుకోవాలి. 2కి అధిపతి చంద్రుడు, 7కి కేతువు. కాబట్టి వీరిద్దరూ శివునికి క్షీరాభిషేకం చేయాలని న్యూమరాలజీ సూచిస్తోంది. శివుని ఆశీర్వాదంతో మంచి సపోర్ట్ లభిస్తుంది.
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Horoscope, Numerology