హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Numerology : మార్చి 16.. మీరు 11వ తేదీన జన్మించారా.? ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే ఫలితాలు బావుంటాయి.!

Numerology : మార్చి 16.. మీరు 11వ తేదీన జన్మించారా.? ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే ఫలితాలు బావుంటాయి.!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Numerology Today:(పూజా జైన్ - న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890) ప్రత్యేకమైన, శక్తివంతమైన వైబ్రేషన్స్‌ కలిగి ఉన్న 11వ నంబర్‌ను మాస్టర్ నంబర్ అని పిలుస్తారు. వారు ఆదర్శవాదులు, దూరదృష్టి గలవారు. ప్రత్యేకమైన ఆలోచనలు చేస్తుంటారు. వీరు ఎక్కువగా కలలు కంటుంటారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Visakhapatnam

Numerology:పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. ఆ సంఖ్యల ఆధారంగా సంబంధిత వ్యక్తులకు ఎదురుకాబోయే ప్రమాదాలు, శుభాలను న్యూమరాలజీ (Numerology) నిపుణులు అంచనా వేస్తుంటారు. ఉద్యోగం, వ్యాపారం, వివాహ సంబంధాలు, చదువు వంటి అంశాల్లో పుట్టిన తేదీ నంబర్‌ ప్రభావం కనిపిస్తుంది. సంబంధిత నంబర్‌ లక్షణాలు, అనుకూలతల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని న్యూమరాలజీ నిపుణులు సూచించారు. ఇప్పుడు నెలలోని 11వ రోజున జన్మించిన వ్యక్తులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఏ రంగాల్లో రాణిస్తారు? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Numerology
ప్రతీకాత్మక చిత్రం

మాస్టర్ నంబర్‌ 11:

ప్రత్యేకమైన, శక్తివంతమైన వైబ్రేషన్స్‌ కలిగి ఉన్న 11వ నంబర్‌ను మాస్టర్ నంబర్ అని పిలుస్తారు. వారు ఆదర్శవాదులు, దూరదృష్టి గలవారు. ప్రత్యేకమైన ఆలోచనలు చేస్తుంటారు. వీరు ఎక్కువగా కలలు కంటుంటారు, పనులు చేయడంపై శ్రద్ధ చూపరు. ఏది ఏమైనప్పటికీ, వారు ఏ పనులు అయినా చేయగల సమర్థులు. తగిన మోటివేషన్‌ ఉంటే కచ్చితంగా ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. వీరితో సమస్య ఏంటంటే వీటి ఐడియాలు ప్రాక్టికల్‌గా ఉండవు. అందుకే ఏదైనా ప్లాన్‌ను అమలు చేసే ముందు జాగ్రత్తగా పరిశీలించడం మేలు.

11వ నంబర్‌లో జన్మించిన వారు సహజంగా, కేరింగ్‌గా ఉంటారు. 11 అనేది అన్ని సంఖ్యలలో అత్యంత సహజమైనది. సెన్సిటివిటీ, ఎమోషనల్‌, మృదు స్వభావం, ప్రాక్టికల్‌గా ఆలోచించక పోవడం, లో ఎనర్జీ వంటివి వారి వ్యక్తిత్వంలో అంతర్భాగంగా మారాయి. వారు ఎక్కువగా ఊహల్లో ఉంటారు, తరచూ పగటి కలల్లో మునిగిపోతారు. 11వ నంబర్‌, 2లోని అన్ని అంశాలను కలిగి ఉంటుంది. 11లో జన్మించిన వారు తమ స్థాయికి మించిన లక్ష్యంపై దృష్టి పెట్టరు. భయం, ఫోబియాలను క్రియేట్‌ చేసుకుంటారు. వీరు గ్రేట్‌నెస్‌, స్మార్ట్‌నెస్‌కి మధ్యలో ఉంటారు.

రియాలిటీ చెక్‌ చేసుకోవాలి:

తమ పరిస్థితిపై అవగాహన పెంచుకోవడం, ఆధ్యాత్మిక అంశాలను అంగీకరించడంపై వారి వృద్ధి, వ్యక్తిగత అభివృద్ది ఆధారపడి ఉంటాయి. 11కి మనఃశాంతి లాజిక్‌లో ఉండదు, ఎమోషన్‌లో కనిపిస్తుంది. వీరు కష్ట సమయాల్లో అంతర్గత బలాన్ని కనుగొంటారు. సంక్షోభం, గందరగోళాన్ని సమర్థంగా ఎదుర్కొంటారు. వీరు సహజంగా ఇతరుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తారు, అందరి కళ్ళు వీరిపైనే ఉండాలనే ఉద్దేశంతో ఆడంబరంగా ప్రవర్తిస్తారు. సంక్షోభ సమయాల్లో ఇతరులతో పాటు కూడా మార్గనిర్దేశం చేయగలుగుతారు. మీ గొప్ప ప్రతిభను తలపైకి వెళ్లనివ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు నేల విడిచి సాము చేయకుండా ఉండేందుకు స్నేహితులు, కుటుంబ సభ్యులను సంప్రదించి రియాలిటీ చెక్‌ చేసుకోవాలి.

First published:

Tags: Astrology, Horoscope, Numerology

ఉత్తమ కథలు