• HOME
  • »
  • NEWS
  • »
  • ASTROLOGY
  • »
  • 5 ZODIAC SIGNS WHO LOVE NATURE OVER OTHER THINGS THEN WHAT ABOUT YOU SK GH

Zodiac Signs: ఈ రాశి వారు ప్రకృతి ప్రేమికులు.. చెట్లు పుట్టలంటే ప్రాణం.. మరి మీరు..?

Zodiac Signs: ఈ రాశి వారు ప్రకృతి ప్రేమికులు.. చెట్లు పుట్టలంటే ప్రాణం.. మరి మీరు..?

ప్రతీకాత్మక చిత్రం

Zodiac Signs: కొంతమంది విపరీతంగా ప్రకృతిని ప్రేమించేస్తుంటారు. అలాంటివారు మీ మధ్యన ఉన్నారేమో, ఉంటే వారు ఈ కింది రాశులకు చెందినవారేమో అన్నది చెక్ చేసుకోండి..

  • Share this:
మనకున్న కొన్ని అలవాట్లు, ఇష్టాలు.. మన గ్రహస్థితుల ప్రభావంతోనే వస్తాయి. మీరు ఎంత వదిలించుకోవాలనుకున్నా కొన్ని విషయాలపై మీకు మనసు లాగుతూనే ఉంటుంది దానికి కారణం కూడా ఈ గ్రహ ప్రభావమే అని గుర్తుంచుకోండి. కొందరికి ప్రకృతి అంటే మహా ఇష్టం. అలా చెట్లు, పుట్టలు వంటివి చూస్తూ వీరు జీవితకాలాన్ని కూడా ఈజీగా గడిపేయగలరు. అదేమంటే వారి అభిరుచి అలాంటిది. వీరికి ఈ అభిరుచి రాశి ఫలాలను బట్టి వచ్చినదే. కొందరు సంతోషంగా హిమాలయాలకు వెళ్లిపోయి అక్కడే ఉండిపోతే ఎంతబావుంటుందో అని ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. వీరికి ఇహలోకంలోని ఇతర విషయాలకంటే స్వచ్ఛమైన ప్రకృతి ఇచ్చే ఆనందం, సంతృప్తి ఎక్కువ. వీరు ఎప్పుడూ తోటపని చేస్తూ హ్యాపీగా గంటలతరబడి అలా గడిపేస్తారు. తామున్నది కాంక్రీట్ జంగిల్ లోనే అయినా పచ్చని తోటలంటే ఇష్టపడటం, ఇంటిచుట్టూ మొక్కలు పెంచటానికి వీరు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏదైనా రెస్టారెంట్ వెళ్లటం కంటే ఏ అడవికో వెళ్లటాన్ని వీరు ఎంచుకుంటారు. అలాంటి అభిరుచి ఉన్న 5 రాశుల వారు ఎవరో మీరే చదవండి..

వృషభం (Taurus)

వృషభ రాశి స్త్రీ, పురుషులకు ప్రకృతి అంటే చాలా మమకారం. వీళ్లు చాలా స్థిరచిత్తులుగా ఉంటూ, రియాల్టీకి దగ్గరగా ఉంటారు. వీరిని ప్రపంచంలో బాగా ఆకట్టుకునే శక్తి దేనికైనా ఉందంటే అది కచ్ఛితంగా ప్రకృతే అని చెప్పాలి. వీరి ధ్యాస అంతా ఎప్పుడూ ఇలాంటి ప్రకృతికి సంబంధించిన విషయాలపైనే ఉంటుంది. పుడమితల్లిని అమితంగా ప్రేమించే వీరు ప్రకృతి ఆరాధకులుగా స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటారు. చెట్లు, జంతువులు అంటే వీరు చూపే ప్రేమ అపారం. ప్రకృతిలో తదాత్మ్యం చెందటం వీరికి ప్రాణంతో సమానం. హాయిగా చెట్లు, పుట్టలు, కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, వన్యప్రాణులు చూస్తూ వృషభరాశి వారు గడిపేయగలరు. వీరికి కాస్త తీరిక దొరికితే ఇలాంటివి ఆస్వాదించేందుకు సమయం, డబ్బు రెండూ వెచ్చిస్తారు. ప్రకృతి ఒడిలో సేదతీరితే చాలు వీరు ఇట్టే రీచార్జ్ అవుతారు. మీ సన్నిహితులు ఎవరైన వృషభ రాశి వారుంటే మీరు వారిని కూల్ చేయాలంటే అలా ప్రకృతి సోయగాలను వారికి చూపించండి చాలు.

తుల రాశి (Libra)

ఎప్పుడూ పచ్చని ప్రకృతిని చూడటం అంటే వీరికి ఫేవరెట్ పాస్ టైం అనుకోండి. తుల రాశి వారు తమ ఇంటిని, చుట్టుపక్కల వాతావరణాన్ని స్వచ్ఛమైన ప్రకృతి ఉట్టిపడేలా ఇంటీరియర్ చేయించుకుంటారు. వీరికి పచ్చ రంగంటే కూడా ప్రాణం. వీరికి పువ్వులు, సీతాకోక చిలుకలు, చెట్లు, వాటర్ బాడీస్ అయిన నదులు, సముద్రాలు, చెరువులు, పిల్ల కాలువలు, వాటర్ ఫాల్స్ అంటే చాలాచాలా ఇష్టం. తుల రాశి వారికి ఫేవరెట్ ప్లేసులు అంటే అడవులు, తోటలు, పచ్చికబయళ్లు, జూ పార్కులు, పూల తోటలు వంటివే. స్వచ్ఛమైన ప్రకృతికి ప్రత్యామ్నాయం ఏదీ లేదని బలంగా విశ్వసించేవీరు ప్రకృతికి సలాం చేస్తారు.

ధనూ రాశి (Sagittarius)

ప్రకృతి ఆరాధనలో భాగంగా వీరు విస్తృతంగా ప్రయాణాలు చేస్తారు. తరచూ టూర్లు కొట్టే వీరు నేచర్ ని బాగా ఎంజాయ్ చేసేందుకు వరల్డ్ టూర్ కొట్టడానికి ప్రాధాన్యత ఇస్తారు. ట్రెక్కింగ్ అంటే ధనూ రాశి స్త్రీ, పురుషులు బాగా ఇష్టపడతారు. కొండలు, గుట్టలు ఎక్కటం అక్కడి నుంచి నేచర్ ను చూసి ఆ ఏరియల్ వ్యూలో తమను తాము మైమరచిపోవటం వీరికి అత్యంత ఇష్టమైన వ్యసనం. బాగా జనసమ్మర్ధనం ఉన్న ప్రాంతాలను వీరు ఏమాత్రం ఇష్టపడకపోగా జనావాసాలు పెద్దగా లేని ప్రాంతాలకు వెళ్లి వీరు ప్రశాంతంగా ఉండటాన్ని ఇష్టపడతారు. నేచర్ లవర్స్ అయిన ధనూ రాశి వారు స్వచ్ఛమైన వాతావరణాన్ని ఇష్టపడతారు.

మీన రాశి (Pisces)

మీన రాశి వారు పగటి కలలు ఎక్కువ కంటారు. తమ ఊహాలోకంలో విహరించటమే వీరు ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటారు. ప్రకృతి ఒడిలో ఇలా చేయటం అంటే వీరు తమకంటూ ఉన్న మరో ప్రత్యేక లోకంలో ఉన్నట్టు భావిస్తారు. చెట్లు వంటివి లేనిచోట ఉండటం అంటే వీరు ఊపిరి ఆడనట్టుగా భావిస్తారు. కావాలంటే ఒంటరిగా అడవిలోనైనా హ్యాపీగా గడిపేయగలరు. కానీ  మీన రాశి స్త్రీ, పురుషులు మొక్కలు లేని చోట కొంతసేపు కూడా ప్రశాంతంగా ఉండలేరు. పచ్చని ప్రకృతిని తలచుకుంటూ వీరు చాలా సంతోషాన్ని పొందుతారు.

కర్కాటక రాశి (Cancer)

కర్కాటక రాశి వారు నేచర్ లవర్స్ (nature lovers) . వీరు చాలా సున్నిత మనస్కులు. ప్రకృతి పట్ల ఎంతో ప్రేమ, దయ ఉన్న వీరు ప్రశాంతంగా, ధ్వని కాలుష్యం లేని నిర్జన ప్రాంతాలను బాగా ఇష్టపడతారు. నదులు, నదీ తీరాలు వంటి ప్రాంతాల్లో కర్కాటక రాశి విహరించారంటే తమను తామే మరచిపోతారు. జనాలు ఎక్కువ ఉన్న ప్రాంతాలంటే వీరికి చికాకు. పచ్చని ప్రకృతిలో జీవితాన్ని గడపటాన్ని వీరు ఇష్టపడతారు కనుక తాము ఎక్కడుంటే అక్కడ మొక్కలు పెంచటం వంటివి చేస్తుంటారు. ప్రకృతి ఆరాధకులు అయిన కర్కాటక రాశి స్త్రీ, పురుషులు చాలా ఎమోషనల్ గా ఉంటారు.
Published by:Shiva Kumar Addula
First published:

అగ్ర కథనాలు