ప్రతి ఒక్కరి జీవితంలో సరసాలాడటం అనేది ఒక కళ. కొంతమంది సరసాల్లో అందవేసిన చేయి. వారికి సరసాలాడటం వెన్నతో పెట్టిన విద్య. అలాంటి వ్యక్తులు తమ భాగస్వామితో తరచూ సరసాలాడుతూ వారితో చాలా మృదువుగా వ్యవహరిస్తారు. వారు తమ ప్రియమైన వారితో చలాకీగా వ్యవహరిస్తూ వారి హృదయాల్లో గొప్ప స్థానాన్ని సంపాదించుకుంటారు. సరసం(Flirting)తో వారి ప్రియమైన వారిని మంత్ర ముగ్ధుల్ని చేస్తారు. తమ ప్రియమైన వారిని ఆకర్షించడానికి, వారి పట్ల ప్రేమ చూపించడానికి సరసాన్ని గొప్ప మార్గంగా ఎంచుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం కూడా కొన్ని రాశుల(Zodiac signs) వారు సరసంలో ముందుంటారని చెబుతోంది. అయితే, కొంత మందికి మాత్రం రొమాన్స్లో బేసిక్స్ కూడా తెలియవు. దీంతో ఎవరినీ ఆకట్టుకోలేక తెగ ఫీలైపోతుంటారు. అదే, సరసాలడే వ్యక్తులు మాత్రం తాము ఇష్టమైన వారిని సున్నితమైన మాటలతో ఇట్టే ఆకర్షిస్తారు. ఆ రాశుల వారిపై ఓలుక్కేయండి.
మేష రాశి
ప్రియమైన వారితో సరసాలాడటంలో మేష రాశి(Aries) వారిది అందవేసిన చేయి. వీరు మంచి హాస్యం ద్వారా ఇతరులను ఇట్టే ఆకర్షిస్తారు. అంతేకాక, వారి చలాకీ తనంతో తమ ప్రియమైన వారిని మంత్రముగ్ధుల్ని చేస్తారు. అంతేకాక, వారి వ్యక్తిత్వంతో ఇతరులను సులభంగా తమ వైపుకు తిప్పుకుంటారు.
మిథున రాశి
మిథున(Gemini) రాశి వారు చాలా సరస జీవులు. వీరు తమ ప్రియమై వారిని ఆకట్టుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ముఖ్యంగా వీరు తమ అందం కంటే, నిజాయితీతోనే అవతలి వ్యక్తిని ఎక్కువగా ఆకర్షిస్తారు. అంతేకాక, వీరు అవతలి వ్యక్తి భావాలను అంగీకరించడంలో కూడా చిత్తశుద్ధిని కలిగి ఉంటారు. తమ ప్రియమైన వారిని పొగుడుతూ ఇట్టే ఆకట్టుకుంటారు.
సింహ రాశి
సింహ రాశి(Leo)కి చెందని వారు స్నేహపూర్వక, నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వారు ఇతరులను ఆకట్టుకోవడంలో, సరసాలాడటంలో సిద్ధహస్తులు. ఈ రాశికి చెందిన వారు ఇతరులతో ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా ఉంటారు. ఎవరినైనా వీరు ఇష్టపడితే మాత్రం, వారిని ప్రేమలో పడేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఉల్లాసభరితమైన సరసాలతొ ఇతరుల దృష్టిని తమవైపుకి తిప్పుకుంటారు.
వృశ్చికం
వృశ్చిక రాశి(Scorpio) వారు ఎప్పుడూ సంతోషంగా, మనోహరంగా ఉంటారు. వీరు ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా కనిపిస్తూ ఇతరుల చూపును తమ వైపుకు తిప్పుకుంటారు. అంతేకాక, వీరి వాక్ఛాతుర్యంతో అవతలి వ్యక్తిని మంత్రముగ్ధుల్ని చేస్తారు. వీరి మనోహరమైన సరసమైన వ్యక్తిత్వంతో తమ ప్రియమైన వారికి సులభంగా దగ్గరవుతారు.
ధనుస్సు
ధనుస్సు రాశి (Sagittarius) వారు జీవితంలో కొత్త విషయాలను నేర్చుకోవడానికి, కొత్త వ్యక్తులను కలుసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వీరు అవతలి వ్యక్తిని ఆకట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఫలితంగా, సరసాలాడుట వారి వ్యక్తిత్వంలో ఒక భాగం అవుతుంది. తమకు ఇష్టమైన వారి పట్ల ఆసక్తికరంగా ఉన్నట్లు తెలియజేయడానికి సరసం ఒక గొప్ప మార్గంగా భావిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Friendship, Zodiac signs