Home /News /astrology /

5 ZODIAC SIGNS THAT ARE GOOD AT HANDLING MONEY HERE IS DETAILS MKS

Handling Money: మనీ మేనేజ్‌మెంట్‌లో ఈ 5 రాశుల వారు దిట్ట.. జాబితాలో ఉన్న రాశులివే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మొత్తం 12 రాశులలో 5 రాశుల వారికి డబ్బులు హ్యాండిల్ చేసే నైపుణ్యం స్వతహాగా వస్తుందని జ్యోతిష శాస్త్రం (Astrology) చెబుతోంది. మరి ఆ ఐదు రాశుల వారిలో మీరు కూడా ఉన్నారో లేదో తెలుసుకోండి.

ఆదాయం, అప్పులు, పొదుపు, ఖర్చులను సమతూకం చేసుకుంటూ మనీ మేనేజ్‌మెంట్ చేయగలగడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. చేతిలో రూ.కోట్లు ఉన్నా వాటిని సరిగ్గా ఖర్చు పెట్టకపోతే ఆ డబ్బంతా హారతి కర్పూరంలా ఆవిరైపోతుంది. డబ్బులు సంపాదించడం కంటే సాధించిన డబ్బును ఎలా ఉపయోగించాలనేదే అసలైన సవాల్ గా అందరి ముందు ఉంటుంది. అయితే మొత్తం 12 రాశులలో 5 రాశుల వారికి డబ్బులు హ్యాండిల్ చేసే నైపుణ్యం స్వతహాగా వస్తుందని జ్యోతిష శాస్త్రం (Astrology) చెబుతోంది. మరి ఆ ఐదు రాశుల వారిలో మీరు కూడా ఉన్నారో లేదో తెలుసుకోండి.

* మేషం
మేష రాశి వారికి అంతగా ఓపిక ఉండకపోవచ్చు కానీ డబ్బును హ్యాండిల్ చేయడంలో వారికి వారే సాటి. ఈ రాశి వారు ఏదైనా సరే ఈజీగా సాధించగలరు. డబ్బు సంపాదించే మార్గాలను అన్వేషించడంలోనూ వీరు అందరికంటే ముందుంటారు. డబ్బులు సంపాదించడానికి వివిధ రకాల పనులను కనిపెట్టడానికి వీరు చాలా ఉత్సుకతతో ఉంటారు. డబ్బు విషయంలో వీరు చాలా తెలివిగా ప్లాన్స్ రచిస్తారు. మేష రాశి వారు హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడరు. కానీ స్మార్ట్‌గా వర్క్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటారు. డబ్బు సంపాదనకు షార్ట్‌కట్‌ల కోసం వీరిని సలహా అడగొచ్చు.

shocking : భర్త పురుషాంగాన్ని కోసేసిన భార్య.. బలవంతపు సెక్స్ భరించలేక.. ఆమెపై IPC 324సెక్షన్



* వృషభం
అన్ని రాశులలో వృషభ రాశిని అత్యంత శుభప్రదమైన రాశిగా పేర్కొంటారు. ఈ రాశి వారికి పుట్టుకతోనే సంపద వస్తుందని నమ్ముతుంటారు. అలాగే వృషభ రాశి వారు తమ లక్ష్యాలను ఈజీగా నెరవేర్చుకోగలరు. డబ్బు విషయంలో కూడా వీరు ఎంతో నేర్పు కలిగి ఉంటారు. వృషభరాశి వారు తెలివిగా తమ సొంత డబ్బుతో మాత్రమే విలాసాలకు పోతారు. అప్పులు చేయడానికి వారు ఇష్టపడరు. ఖర్చులను ఎలా నియంత్రించాలో డబ్బులు ఎలా ఆదా చేయాలో వారికి బాగా తెలుసు. అలాగే వారు దూరదృష్టితో తరచూ లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెడతూ చక్కటి రాబడి అందుకుంటారు. వీరి దగ్గర ఉన్న డబ్బు రెట్టింపు అవుతుంది తప్ప అస్సలు తగ్గదు.

* సింహరాశి
సింహరాశి వారు నెవెర్ గివ్ అప్ అనే మనస్తత్వంతో ఉంటారు. ఈ రాశివారు మరింత డబ్బు సంపాదించడానికి అనునిత్యం మార్గాలను వెతుకుతుంటారు. వీరు తాము కోరుకున్నది సాధించడానికి ఎంతవరకైనా వెళ్తారు. డబ్బు విషయంలో కూడా వీరు నిశ్చితాభిప్రాయంతో కావాల్సినంత డబ్బును సంపాదించగలరు. ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో చాలామంది సింహరాశివారే ఉంటారని.. ఇందుకు కారణం వీరు డబ్బును చక్కగా హ్యాండిల్ చేయగలగడమేనని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతుంటారు.

Karepalli : అయ్యో మనీషా.. ఎంతపని చేశావమ్మా.. మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడొద్దన్నందుకు..



* కన్య
కన్యరాశి వారు ధనవంతులు కావడానికి చాలా ఆస్కారం ఉంది. మీకు తెలిసిన ధనవంతుల్లో కనీసం ఒక్కరైనా కన్యరాశి వారు ఉంటారు. ఎందుకంటే వారికి డబ్బు సంపాదించడం వెన్నతో పెట్టిన విద్య. ఎప్పుడూ ఉత్తమ వ్యక్తులుగా ఉండాలని కోరుకునే వీరు సామాన్యమైన జీవితంతో సంతృప్తి చెందరు. ఇక పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంటే.. వారు తమ దృష్టినంతా కేంద్రీకరించి అధిక రాబడిని కచ్చితంగా పొందగలరు. ఇన్వెస్ట్‌మెంట్ విషయానికి వస్తే వారి ప్లానింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. అంతేకాదు వారు చాలా వాస్తవాలను గ్రహించి చాలా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వీరు డబ్బులు హ్యాండిల్ చేయడంలో ఉత్తమమైన నేర్పు కలిగి ఉంటారు.

* వృశ్చికం
వృశ్చికరాశి వారికి చక్కటి అంతర్దృష్టి ఉంటుంది. పుట్టుకతోనే వచ్చే తమ దివ్య జ్ఞానంతో వారు లాభదాయకమైన మార్గాలను ముందుగానే తెలుసుకోగలరు. ఈ రాశి వారి మార్కెటింగ్ వ్యూహాలు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయి. వీరు తమ ఉద్యోగంలో ఎలా మెరుగ్గా పని చేయాలో.. అత్యుత్తమంగా ఉండటానికి ఎలా పోటీపడాలో సులభంగా తెలుసుకుంటారు. ప్లానింగ్ లో వీరు సూపర్ కాబట్టి మనీ హ్యాండింగ్ వీరికి నల్లేరు మీద నడక లాంటిది.
Published by:Madhu Kota
First published:

Tags: Money making, Zodiac signs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు