హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Indoor Plants: పాజిటివ్ ఎనర్జీ, సంపద, శ్రేయస్సును ఆకర్షించే ఇండోర్ ప్లాంట్స్.. ఇంట్లో ఏ దిశలో పెంచాలో తెలుసుకోండి..

Indoor Plants: పాజిటివ్ ఎనర్జీ, సంపద, శ్రేయస్సును ఆకర్షించే ఇండోర్ ప్లాంట్స్.. ఇంట్లో ఏ దిశలో పెంచాలో తెలుసుకోండి..

కొన్ని మొక్కలు

కొన్ని మొక్కలు

Indoor Plants: మనకు అందుబాటులో ఉన్న ఇండోర్ ప్లాంట్స్‌లో ఏవి బెస్ట్? వాటిని ఎలా పెంచాలి? ఇంట్లో ఎక్కడ ఉంచాలనే విషయాలపై చాలామందికి అవగాహన ఉండదు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Delhi, India

సాధారణంగా ఇంటి బయట మొక్కలు పెంచుకుంటుంటారు. అయితే ఇంటి లోపల కూడా గ్రీనరీ ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్‌ ఇంటి లోపలికి పాజిటివ్ వైబ్స్ తీసుకురావడమే కాక, ఇంట్లో గాలి నాణ్యతను కూడా మెరుగుపరుస్తాయి. వీటితో ఇళ్లు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే మనకు అందుబాటులో ఉన్న ఇండోర్ ప్లాంట్స్‌లో ఏవి బెస్ట్? వాటిని ఎలా పెంచాలి? ఇంట్లో ఎక్కడ ఉంచాలనే విషయాలపై చాలామందికి అవగాహన ఉండదు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.

* తులసి

హిందూ సనాతన ధర్మంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీన్ని హిందువులు ఎంతో పవిత్రంగా పూజిస్తారు. ఈ మొక్క ఇంట్లోకి శాంతి, ఆనందాన్ని తెస్తుందని చాలా మంది నమ్మకం. వాస్తుశాస్త్రం ప్రకారం.. తులసి మొక్క చెడు, ప్రతికూలతను దూరం చేస్తుంది. ఈ మొక్కను ఇంటి తూర్పు లేదా ఈశాన్య దిశలో పెంచుకోవచ్చు. అయితే దీన్ని ఎంతో నిష్టగా చూసుకోవాలి.

* లిల్లీ

ఇంట్లో పెంచుకునే అతి ముఖ్యమైన మొక్కల్లో లిల్లీ ఒకటి. ఇది ఇంటికి ఆకర్షణను తీసుకొస్తుంది. ఈ మొక్క ఇంట్లో ఉంటే ఇంటికి కళ వస్తుంది. లిల్లీ మొక్క ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇది ఇంట్లోని గాలిని శుద్ధి చేస్తుంది. అలాగే ఇంట్లో ఉన్నవారికి మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. లిల్లీ మొక్కను తూర్పు దిక్కులో ఉంచాలి. అయితే సంపద, శ్రేయస్సు కావాలనుకున్న వారు దీన్ని నైరుతి దిక్కులో ఉంచుకోవచ్చు.

* మనీ ప్లాంట్

ఈ మొక్క చాలా మంది ఇళ్లలో కనిపిస్తుంది. అదృష్టం, పాజిటివిటీ, విజయానికి మనీప్లాంట్ ప్రసిద్ధి చెందింది. అలాగే ఆర్థిక శ్రేయస్సును కూడా ఇది ప్రభావితం చేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ ఉంచితే శుభం జరుగుతుందని చాలా మంది నమ్మకం. ఈ మొక్క నీడలోనే ఆరోగ్యంగా పెరుగుతుంది.

* లక్కీ వెదురు

వాస్తు శాస్త్రం ప్రకారం.. సంపద కలగాలంటే లక్కీ బ్యాంబూ (Lucky Bamboo) మొక్కను ఇల్లు లేదా ఆఫీస్‌లో ఆగ్నేయ దిశలో ఉంచాలి. దీన్ని ఇంట్లో నాటుకుంటే అదృష్టం కలిసి వస్తుందని చాలా మంది నమ్ముతారు. అంతా శుభమే జరుగుతుందని భావిస్తారు. ఈ మొక్క బాగా పెరగాలంటే వెలుతురు తక్కువగా ఉండాలి.

* స్నేక్ ప్లాంట్

ఆకులను బట్టి ఈ ఇండోర్ ప్లాంట్‌ను గుర్తించవచ్చు. ఈ మొక్క గాలిని శుభ్రపరుస్తుంది. ఇంట్లో ఆక్సిజన్ లెవల్స్‌ను మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. ఈ మొక్కను పడకగదిలో ఉంచుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించే ఈ మొక్కను తూర్పు, దక్షిణ లేదా ఆగ్నేయ దిక్కుల్లో ఉంచాలి. అలాగే దీనిపై సూర్యకాంతి పడేట్లు చూసుకోవాలి.

* అవి డేంజర్

కొన్ని ఇండోర్ మొక్కలు పాజిటివ్ ఎనర్జీ, ఐశ్వర్యం తీసుకొస్తే.. మరికొన్ని మాత్రం ఇంట్లో అనేక సమస్యలకు కారణమవుతాయని వాస్తు శాస్త్రం సూచిస్తుంది. కాబట్టి సంపద వృద్ది, శ్రేయస్సుకు దోహదం చేసే వెదురు, జాస్మిన్, కలబంద, మనీ‌ప్లాంట్ వంటి మొక్కలను ఇంటి లోపల ఉంచుకోవాలి. ముళ్ల జాతి కాక్టస్ మొక్కలు, తీగ జాతి మొక్కలను ఇంట్లో పెంచకూడదు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Astrology, Plants

ఉత్తమ కథలు