Get Married Early: ఈ రాశుల వారు త్వరగా పెళ్లి చేసుకుంటారట..! మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

కొంతమంది వ్యక్తులు జీవితంలో త్వరగా పెళ్లి చేసుకోవాలని తహతహలాడుతుంటారు. తమకు ఎల్లప్పుడు తోడుగా ఉండే భాగస్వామి కోసం పరితపిస్తుంటారు. తర్వగా వైవాహిక జీవితం ప్రారంభిస్తేనే జీవితం సాఫీగా సాగిపోతుందని విశ్వసిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం నాలుగు రాశుల వారు ఇటువంటి ఆలోచనా విధానాన్ని కలిగి ఉంటారు. వారు త్వరగా వివాహం చేసుకోవాలని కోరుకుంటారు. ఆ రాశులేంటో చూద్దాం.

  • Share this:
పెళ్లి ఏ వయసులో చేసుకోవాలనే ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కో రకంగా సమాధానమిస్తుంటారు. కొంతమంది 25 ఏళ్లలోపే పెళ్లి చేసుకోవాలని భావిస్తుంటారు. మరికొందరు 30 దాటితే కాని పెళ్లి చేసుకోరు. ఇది వారి వ్యక్తిగత ఆలోచనా విధానం, ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. పెళ్లి చేసుకుంటే వ్యక్తిగత స్వేచ్ఛ కోల్పోతామని, భార్య/భర్త చెప్పినట్లు వినాల్సి ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. అందుకే, మూడు ముళ్ల బంధం కంటే ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారు. మరోవైపు కొంతమంది వ్యక్తులు జీవితంలో త్వరగా పెళ్లి చేసుకోవాలని తహతహలాడుతుంటారు. తమకు ఎల్లప్పుడు తోడుగా ఉండే భాగస్వామి కోసం పరితపిస్తుంటారు. తర్వగా వైవాహిక జీవితం ప్రారంభిస్తేనే జీవితం సాఫీగా సాగిపోతుందని విశ్వసిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం నాలుగు రాశుల వారు ఇటువంటి ఆలోచనా విధానాన్ని కలిగి ఉంటారు. వారు త్వరగా వివాహం చేసుకోవాలని కోరుకుంటారు. ఆ రాశులేంటో చూద్దాం.

మిథున రాశి
మిథున రాశి వారు త్వరగా వైవాహిక జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటారు. వీరు ఒంటరితనాన్ని అస్సలు భరించలేరు. తమ కష్ట సుఖాలు పంచుకునేందుకు జీవిత భాగస్వామి అవసరమని నమ్ముతారు. అందుకే యవ్వనంలోనే పెళ్లి తంతులోకి అడుగుపెడతారు.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు కూడా త్వరగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని భావిస్తారు. హ్యూమన్​ ఎమోషన్స్​కు ప్రాధాన్యతనిస్తారు. పెళ్లి చేసుకుంటేనే బంధాలు దృఢంగా ఉంటాయని నమ్ముతారు. వీరుఎల్లప్పడూ సాన్నిహిత్యం, విధేయతను కోరుకుంటారు. అందువల్ల జీవితంలో త్వరగా స్థిరపడి వివాహం చేసుకోవాలని భావిస్తారు.

తులరాశి
తులరాశి వారు ఇతర వ్యక్తులకు ప్రేమను పంచుతారు. అదేవిధంగా వారి నుంచి ప్రేమను ఆశిస్తారు. ఒంటరితనానికి దూరంగా బంధాలకు దగ్గరగా ఉండాలని భావిస్తారు. జీవితంలో అన్ని విధాలా తోడుండే వ్యక్తిని వారు కోరుకుంటారు. అందుకే 21 నుంచి 25 ఏళ్ల మధ్య వివాహం బంధంలోకి అడుగుపెట్టాలని భావిస్తారు.

కన్యరాశి
కన్యరాశి వారు ఎల్లప్పుడూ తమంతట తాముగా కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రాధాన్యతనిస్తారు. అయితే వారు తలపెట్టిన ఏ కార్యాన్నైనా వెన్నుతట్టి ప్రోత్సహించడానికి భాగస్వామి అవసరమని భావిస్తారు. భాగస్వామి ప్రోత్సాహంతో జీవితంలో అద్భుతాలు సాధించవచ్చని భావిస్తారు. అందుకే త్వరగా వైవాహిక జీవితంలోకి అడుగు పెడతారు.
Published by:Veera Babu
First published: