Rasi Phalalu : వార ఫలాలు... ఈ వారం ఎవరి ఫలం ఎలా ఉంటుంది... మీ వార ఫలాలు తెలుసుకోండి...

Weekly Horoscope : గ్రహాల కదలికలు, రాసులను బట్టీ ఈ వారం ఎవరి అదృష్టం ఎలా ఉందో విజయవాడకు చెందిన ప్రముఖ జ్యోతిష్కులు రాళ్లపల్లి వెంకటేశ్వర శర్మ (srivatcha@gmail.com) గారి ద్వారా తెలుసుకోండి.

Krishna Kumar N | news18-telugu
Updated: July 14, 2019, 8:45 AM IST
Rasi Phalalu : వార ఫలాలు... ఈ వారం ఎవరి ఫలం ఎలా ఉంటుంది... మీ వార ఫలాలు తెలుసుకోండి...
ఈ వారం మీ రాశి ఫలం తెలుసుకోండి.
Krishna Kumar N | news18-telugu
Updated: July 14, 2019, 8:45 AM IST
మేష రాశి : ది. 14-7-2019 నుంచీ ది.20-7-2019 వరకు రాశి ఫలితాలు.
మేష రాశి వారు... ఈ వారం రవి, రాహువుల ప్రభావం వల్ల కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. ఐతే, గురుగ్రహం, కుజగ్రహాల ప్రభావం వల్ల పనులకు ఆటంకాలు కలుగుతుంటాయి. శుక్రుడు వల్ల ఖర్చులు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. కుజుడు, బుధుడు వల్ల విద్య, ఉద్యోగ అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. శని, కేతువుల వల్ల సంతాన పరమైన ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ది. 17-7-2019 రవి గ్రహం సంక్రమణం చెందిన తర్వాత అనుకున్నవి సాధించే అవకాశాలు కలుగుతాయి. మేష రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మంచిది.

వృషభ రాశి : ది. 14-7-2019 నుంచీ ది.20-7-2019 వరకు రాశి ఫలితాలు.

వృషభ రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్త పడాలి. రవి, శుక్ర, రాహు కలయిక వల్ల కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి. కుజ, బుధ గ్రహాల కలయిక వల్ల అప్పులు చేయాల్సి రావచ్చు. కంటి సమస్యలు కలిగే ప్రమాదం ఉంది. గురు గ్రహ ప్రభావం వల్ల మానసిక చింతన కలిగి... సత్యార్యాల్లో పాల్గొంటారు. శని, కేతువుల కలయిక వల్ల కొన్ని భయాందోళనలు కలుగుతాయి. ది. 17-7-2019 న రవి సంక్రమణం తర్వాత కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వృషభ రాశి వారు వినాయక స్వామి ఆరాధన చేయడం మంచిది.



మిధున రాశి : ది. 14-7-2019 నుంచీ ది.20-7-2019 వరకు రాశి ఫలితాలు.
మిధున రాశి వారికి ఈవారం నార్మల్‌గా, సాధారణంగా ఉంటుంది. రవి, రాహువుల వల్ల శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు ప్రభావం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది. అయినప్పటికీ కుజ, బుధ, గురుల ప్రభావం వల్ల ధన వ్యవహారాల్లో ఇబ్బందులుంటాయి. అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. శని, కేతువుల వల్ల మానసిక సమస్యలు తప్పవు. ది. 17-7-2019 న రవి సంక్రమణం తర్వాత పైన చెప్పిన విషయాల్లో కొన్ని మార్పులుంటాయి. మిధున రాశి వారు దుర్గాదేవిని ఆరాధించడం మంచిది.

కర్కాటక రాశి : ది. 14-7-2019 నుంచీ ది.20-7-2019 వరకు రాశి ఫలితాలు.
Loading...
కర్కాటక రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కుజ, బుధల కలయిక వల్ల బుద్ధి మందగించే ప్రమాదం ఉంది. రవి, శుక్ర, రాహువుల దుస్సాహసాల వల్ల డబ్బు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. శని, కేతువుల వల్ల శత్రువుల్ని ఎదిరించే సాహసం చేస్తారు. ది. 17-7-2019 రవి సంక్రమణం తర్వాత కొన్ని మార్పులు వచ్చి మానసిక ప్రశాంతత కలుగుతుంది. గురు గ్రహ ప్రభావం వల్ల సంతానపరమైన శుభవార్తలు వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. డబ్బు విషయంలో ఎవరికీ ఏ హామీలూ ఇవ్వకుండా ఉంటే మంచిది. కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామం చేయడం మంచిది.

సింహ రాశి : ది. 14-7-2019 నుంచీ ది.20-7-2019 వరకు రాశి ఫలితాలు.
సింహ రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. రవి, శుక్ర, రాహువులు లాభంలో ఉండటం వల్ల ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు కలిగే ఛాన్సుంది. కుజ, బుధుల కలయిక వల్ల డబ్బు పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. గురువు వల్ల విద్యార్థులు, స్టడీ విషయంలో తడబడే ప్రమాదం ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా కలిసొస్తుంది. శని, కేతువుల కలయిక వల్ల సంతానపరంగా కొన్ని ఖర్చులవుతాయి. ది. 17-7-2019 రవి సంక్రమణం తర్వాత ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సింహ రాశి వారు శివారాధన చేయడం మంచిది.

కన్యారాశి : ది. 14-7-2019 నుంచీ ది.20-7-2019 వరకు రాశి ఫలితాలు.
కన్యా రాశి వారికి ఈ వారం గురు గ్రహ ప్రభావం వల్ల స్వల్పంగా ప్రయోజనం కలుగుతుంది. శని, కేతువుల ప్రభావం వల్ల విద్యార్థులు విద్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకూ ఇబ్బందులుంటాయి. శారీరక శ్రమ ఎక్కువే ఉంటుంది. రవి, రాహువుల కలయిక వల్ల మానసిక చింతన కలిగి ఉంటారు. కుజ, శుక్ర బుధుల వల్ల ఆకస్మిక ధనం వస్తుంది. కొత్త వ్యాపారాలు చేసేవాళ్లకు అనుకూలం. కన్యారాశి వారు ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం మంచిది.

తులా రాశి : ది. 14-7-2019 నుంచీ ది.20-7-2019 వరకు రాశి ఫలితాలు.
తులా రాశి వారికి ఈవారం అత్యంత అనుకూలం. గురు ప్రభావం వలన డబ్బును పోగు చెయ్యగలరు. శని, కేతువుల వల్ల కొత్తగా భూములు, ఇళ్లు కొనాలని అనుకుంటారు. రవి, రాహువుల ప్రభావం వల్ల మానసిక చింతన ఉంటుంది. పండితుల దర్శనంతోపాటూ... దైవకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు.
శుక్ర గ్రహ ప్రభావం వల్ల విశేష ధనం కలిగే అవకాశాలున్నాయి. కుజ, బుధుల ప్రభావం వల్ల చెడు స్నేహాలు కలిగే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తపడాలి. తులా రాశి వారు లక్ష్మీదేవి ఆరాధన చేయడం మంచిది.

వృశ్చిక రాశి : ది. 14-7-2019 నుంచీ ది.20-7-2019 వరకు రాశి ఫలితాలు.
వృశ్చిక రాశి వారు జాగ్రత్త పడాలి. గురువు వల్ల డబ్బు వస్తుంది. కానీ శని, కేతువుల వల్ల అనవసరమైన ఖర్చులు ఎక్కువవుతాయి. ముఖ్యంగా రవి, శుక్ర రాహువుల ప్రభావం వల్ల ఆరోగ్య పరమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. చెడు స్నేహాలు, వ్యసనాలకు అలవాటయ్యే ప్రమాదం ఉంది. శారీరక పీడ, శ్రమ ఎక్కువగా ఉంటుంది. ది. 17-7-2019 సంక్రమణం తరువాత రవి ప్రభావం తగ్గి, కొద్దిగా మానసిక
ప్రశాంతత కలుగుతుంది. వృశ్చిక రాశి వారు సూర్య ఆరాధన చేయడం మంచిది.

ధనస్సు రాశి : ది. 14-7-2019 నుంచీ ది.20-7-2019 వరకు రాశి ఫలితాలు.
ధనన్సు రాశి వారికి శని, కేతు ప్రభావం వల్ల శారీరక పీడ, మానసిక చింతన చింతన కలుగుతుంది. రవి, రాహువుల వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు. శుక్రుడు వల్ల డబ్బు విషయంలో సామాన్యంగా కలిసొస్తుంది. ది. 17-7-2019 సంక్రమణం తరువాత రవి, కుజ, బుధులు అష్టమంలో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటాయి. గురుగ్రహం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రవిగ్రహం సింహంలోకి ప్రవేశించేంత వరకూ ఆరోగ్య జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి.
సాధ్యమైనంతవరకూ ఎక్కువగా దైవారాధన చేస్తూ ఉండటం మంచిది.

మకర రాశి : ది. 14-7-2019 నుంచీ ది.20-7-2019 వరకు రాశి ఫలితాలు.
మకర రాశి వారికి ఈవారం సాదాసీదాగా ఉంటుంది. రవి, రాహువుల ప్రభావం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు. కానీ శుక్ర గ్రహ ప్రభావం వల్ల వ్యాపారాల్లో సమస్యలు రావచ్చు. డబ్బు విషయంలో జాగ్రత్తపడాలి. ఎదుటివారిని నమ్మి డబ్బు విషయంలో హామీలు ఇవ్వడం సరి కాదు. గురువు వల్ల ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శని, కేతువుల వల్ల మానసిక చింతన కలిగి, దైవకార్యాల్లో పాల్గొంటారు. ఏల్నాటి శని ప్రభావం వల్ల అనవసరంగా డబ్బులు ఖర్చవుతాయి. మకర రాశి వారు
ఆంజనేయస్వామి, అమ్మవారి ఆరాధన చేయడం మంచిది.

కుంభ రాశి : ది. 14-7-2019 నుంచీ ది.20-7-2019 వరకు రాశి ఫలితాలు.
కుంభ రాశి వారికి అనుకూలమైన సమయం. ఐతే... రవి, రాహువుల ప్రభావం వల్ల సంతానపరమైన చిరాకులు కలుగుతాయి. కానీ శుక్ర గ్రహం ప్రభావం వల్ల అనుకోకుండా డబ్బు వస్తుంది. ది. 17-7-2019 సంక్రమణం తరువాత శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. కుజగ్రహ ప్రభావం వల్ల శత్రుపీడ కలిగే ప్రమాదం ఉంటుంది. బుధ గ్రహం ప్రభావం వల్ల అప్పులు చేసే ప్రమాదం కూడా ఉంది. గురు గ్రహ ప్రభావం వలన ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు ఉన్నత విద్యపై నిర్ణయం తీసుకోవడానికి ఇది సరైన టైమ్. శని, కేతువుల వల్ల దైవకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఇష్ట దైవాన్ని ఆరాధించడం మంచిది.

మీన రాశి : ది. 14-7-2019 నుంచీ ది.20-7-2019 వరకు రాశి ఫలితాలు.
మీన రాశిలో పుట్టిన విద్యార్థులు జాగ్రత్తపడాలి. అనవసర ఆలోచనలు, బద్ధకంతో ఉంటారు. ఉద్యోగస్తులు, వ్యాపారులకు ఇది మంచి సమయం. రవి, శుక్ర ప్రభావం వల్ల లాభదాయకంగా ఉంటుంది. రాహువు ప్రభావం వల్ల శ్రమ, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కుజ, బుధుల వల్ల సంతాన పరమైన శుభవార్తలు వింటారు. గురువు వల్ల ఆకస్మిక ధన, భూ లాభాలు కలగొచ్చు. శని వల్ల పేరు ప్రతిష్టలు కలుగుతాయి.
కేతువు వల్ల దైవ చింతన కలిగి, ఎదుటివారికి సహాయ సహకారాలు అందిస్తారు.
బంధువుల నుంచీ శుభవార్తలు వింటారు. మీనరాశి వారు అమ్మవారి ఆరాధన చేయడం
మంచిది.
First published: July 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...