చంద్రబాబు హత్యకు కుట్ర... టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

ఆయన ఇంటిని‌ అణువణువు డ్రోన్ తో విజువల్స్ తీసి రెక్కి నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు

news18-telugu
Updated: August 18, 2019, 1:39 PM IST
చంద్రబాబు హత్యకు కుట్ర... టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు (File)
  • Share this:
టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబును హతమార్చేందుకు ఏపీలో కుట్ర జరుగుతోంది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి‌ వచ్చాక టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రత తగ్గించారని ఆరోపించారు. చంద్రబాబుకు‌ భద్రత పెంచమని హైకోర్టు చెబితే ఆ ఆదేశాల్ని పక్కన పెట్టేశారని జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు బుద్ధా. కావాలనే చంద్రబాబు ఉంటున్న ఇంటిని డ్రోన్ కెమెరాలతో అడుగడుగు విజువల్స్ తీశారన్నారు. చంద్రబాబును‌ హతమార్చే కుట్రలో భాగంగానే ఆయన ఇంటిని‌ అణువణువు డ్రోన్ తో విజువల్స్ తీసి రెక్కి నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నారని బుద్ధా వెంకన్న ఆరోపణలు చేశారు.

మంత్రులే రెక్కి నిర్వహిస్తున్నారని‌ మాకు అనుమానం ఉందన్నారాయన. త్రెట్ ఉన్న వ్యక్తి ఇంటిని డ్రోన్ కెమెరాతో విజువల్స్ తీసేముందు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి గత 15 రోజులుగా మాట్లాడుతున్న మాటలతో మాకు అనుమానం కలుగుతోందన్నారు బుద్ధా వెంకన్న. చంద్రబాబు చంపాలనే కుట్ర గురించి భారతదేశం మొత్తం ప్రజలకు తెలియాలన్నారు. చంద్రబాబును‌ రక్షించుకోవడం కోసం జగన్ ఇంటి ముందు ఆత్మహత్య ‌చేసుకుంటానని విమర్శించారు.

కుట్రను భగ్నం ‌చేయడానికి తాను చనిపోవడానికైనా సిద్ధమ్నారు. వరద వస్తే సరదగా మంత్రులు బ్యారేజ్ ఎక్కి‌ చూస్తున్నారని ఎద్దేవా చేశారు. లంక గ్రామాల‌ప్రజలు ఇబ్బందులు గాలికి వదిలేసారని విమర్శలు గుప్పించారు బుద్ధా. ఏపీలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఏపీ సీఎం జగన్ అమెరికాలో ‌విలాశవంతమైన జీవితం అనుభవిస్తున్నారని ఆరోపణలు చేశారు. అదే చంద్రబాబు అయితే ఎక్కడ ఉన్నా వెంటనే రాష్ట్రానికి వచ్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసేవారన్నారు బుద్ధా. జగన్ 70 రోజుల పాలనను గాలికి వదిలేసారని విమర్శలు చేశారు.

First published: August 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు