Rasi Phalalu : దిన ఫలాలు... ఈ రోజు ఎవరి ఫలం ఎలా ఉంటుంది... మీ దిన ఫలాలు తెలుసుకోండి...

Daily Horoscope : గ్రహాల కదలికలు, రాసులను బట్టీ ఈ రోజు ఎవరి అదృష్టం ఎలా ఉందో విజయవాడకు చెందిన ప్రముఖ జ్యోతిష్కులు రాళ్ళపల్లి వెంకటేశ్వర శర్మ (srivatcha@gmail.com) గారి ద్వారా తెలుసుకోండి.

Krishna Kumar N | news18-telugu
Updated: August 20, 2019, 4:07 AM IST
Rasi Phalalu : దిన ఫలాలు... ఈ రోజు ఎవరి ఫలం ఎలా ఉంటుంది... మీ దిన ఫలాలు తెలుసుకోండి...
రాశి ఫలాలు - మీ రాశి ఫలాలు తెలుసుకోండి.
Krishna Kumar N | news18-telugu
Updated: August 20, 2019, 4:07 AM IST
తేది: 20-8-2019
మేషరాశి వారు ఈరోజు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతూ లాభాలు గడిస్తారు. పారమార్థిక చింతన కలిగి ఉంటారు. సహ ఉద్యోగ, వ్యాపారస్తులతో జాగ్రత్త వహించడం మంచిది.

వృషభరాశి వారికి ఈరోజు విద్యార్థులు దూరప్రయాణాలు చేయవలసివస్తుంది. తద్వారా మానసిక శారీరక శ్రమ అధికం అయ్యే అవకాశం కలదు. ఉన్నత వ్యక్తుల సాంగత్యం లభిస్తుంది.

మిధునరాశి వారికి ఈరోజు మధ్యవర్తి వ్యవహారాల వలన ధనప్రాప్తి కలుగవచ్చు. జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. శత్రువుల వలన ఆర్థికపరమైన ఇబ్బందులు రావచ్చు.



కర్కాటకరాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో లాభదాయకంగా ఉంటుంది. శ్రమ కూడా అధికంగా ఉంటుంది. విద్యార్థులు మందబుద్ధి కలిగి ఉంటారు.

సింహరాశి వారికి ఈరోజు అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. వృత్తి,  ఉద్యోగ,  విద్యా, వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి.

కన్యారాశి వారు ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం కలదు. వృత్తి,  ఉద్యోగ, వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉన్నా సంతృప్తికరంగా ఉండదు. మానసిక చింతన కలుగవచ్చు
Loading...
తులారాశి వారు ఈరోజు సాహస కార్యాలలో ఆసక్తి చూపుతారు. కుటుంబ, ధన, సంతాన విషయాలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావచ్చు.

వృశ్చికరాశి వారికి ఈరోజు ఆర్థికపరమైన జాగ్రత్తలు అవసరం. రుణాలు చేసే ఆలోచనలు కలుగవచ్చు. శారీరక, మానసిక శ్రమ అధికంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది.

ధనస్సురాశి వారికి ఈరోజు శ్రమకు తగ్గ ఫలం దక్కకపోవచ్చు. శత్రువుల వలన ఇబ్బందులు కలుగవచ్చు. జాగ్రత్తగా వ్యవహించడం మంచిది. విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది.

మకరరాశి వారికి ఈరోజు పనులలో కొద్దిపాటి ఆటంకాలు కలిగే అవకాశం వుంది. చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది.

కుంభరాశి వారికి ఈరోజు బంధువుల వల్ల సోదరులవల్ల శుభవార్తలు వినే అవకాశం కలదు. ప్రయత్తపూర్వకంగా అనుకున్న కార్యాలు నెరవేరే దిశగా ఆలోచనలు చేస్తారు.

మీనరాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి కలుగవచ్చు దూరప్రయాణాలు చేసే అవసరాలు రావచ్చు. వాటివల్ల లాభం కలుగవచ్చు. విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది.
First published: August 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...