Rasi Phalalu : దిన ఫలాలు... ఈ రోజు ఎవరి ఫలం ఎలా ఉంటుంది... మీ దిన ఫలాలు తెలుసుకోండి...

Daily Horoscope : గ్రహాల కదలికలు, రాసులను బట్టీ ఈ రోజు ఎవరి అదృష్టం ఎలా ఉందో విజయవాడకు చెందిన ప్రముఖ జ్యోతిష్కులు రాళ్ళపల్లి వెంకటేశ్వర శర్మ (srivatcha@gmail.com) గారి ద్వారా తెలుసుకోండి.

Krishna Kumar N | news18-telugu
Updated: August 18, 2019, 5:18 AM IST
Rasi Phalalu : దిన ఫలాలు... ఈ రోజు ఎవరి ఫలం ఎలా ఉంటుంది... మీ దిన ఫలాలు తెలుసుకోండి...
రాశి ఫలాలు - మీ రాశి ఫలాలు తెలుసుకోండి.
Krishna Kumar N | news18-telugu
Updated: August 18, 2019, 5:18 AM IST
తేది: 18-8-2019
మేషరాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. కష్టానికి తగ్గ ఫలితం లభించదు. మానసిక శ్రమ అధికంగా ఉంటుంది. కార్యకలాపాలు మందకొడిగా ఉంటాయి.

వృషభరాశి వారు ఈరోజు కుటుంబపరమైన అంతర్గత విషయాలలో ఆసక్తి కలిగి ఉంటారు. ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొనే అవకాశం కలదు. లాభాలు సామాన్యంగా ఉంటాయి. ధనపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కలదు.

మిధునరాశి వారికి ఈరోజు కుటుంబపరమైన ఆలోచనలు కలిగి తద్వారా మానసిక ఒత్తిళ్ళు పెరిగే అవకాశం కలదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభసాటిగా ఉంటుంది.



కర్కాటకరాశి వారికి ఈరోజు భార్యాపరమైన కలహాలు కలిగే అవకాశాలు కలవు. ధనపరంగా సమస్యలు రావచ్చు. జాగ్రత్త వహించడం మంచిది. ప్రయాణాల వలన శ్రమ, వ్యయం కలగవచ్చు.

సింహరాశి వారు ఈరోజు కళా, సాహిత్య రంగాలలో ఆసక్తి కలిగి సత్కార్యాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది.

కన్యారాశి వారు ఈరోజు పరస్త్రీ, పరపురుషుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అకారణంగా నిందలుపడే అవకాశాలు కలవు. కుటుంబంలో అంతర్గత కలహాలు రావచ్చు.
Loading...
తులారాశి వారికి ఈరోజు బంధువుల విషయమై స్వల్ప ధననష్టం కలుగవచ్చు. వ్యాపారాలలో స్వల్పలాభాలు కలుగుతాయి. ప్రయాణాల వలన శారీరక శ్రమ అధికంగా ఉంటుంది.

వృశ్చికరాశి వారు ఈరోజు మధ్యవర్తి వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. నిందలు పడటం, నష్టం వచ్చే అవకాశం కలవు. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.

ధనస్సురాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు, సోదరుల విషయమై మానసిక చింతన ఎక్కువగా కలిగి ఉంటారు. సోదరుల వల్ల స్వల్ప లాభాలు కలిగే అవకాశాలు కలవు.

మకరరాశి వారు ఈరోజు సహ వ్యాపారస్తులు, సహ ఉద్యోగస్తుల విషయంలో జాగ్రత్తలు వహించడం మంచిది. కొద్దిపాటి సమస్యలు కలిగి తద్వారా ఆర్థికపరమైన ఇబ్బందులు కలగవచ్చు.

కుంభరాశి వారు ఈరోజు ఆర్థిక విషయాల్లో శ్రద్ధ కలిగి ఉంటారు. శ్రమకి తగ్గ ఫలితం కలగకపోయినా, తృప్పిచెందే ఆలోచన కలిగి ఉంటారు. బంధువులు, సోదరుల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది.

మీనరాశి వారు ఈరోజు మంచి ఆలోచనలు కలిగి పరోపకారానికి ముందుంటారు. తద్వారా ఆర్థిక పరంగా లాభాలు కలిగి పేరు పొందుతారు.
First published: August 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...