అన్నయ్య అని ప్రేమతో పిలిచే నేత.. శివప్రసాద్ మృతిపై పెద్దిరెడ్డి భావోద్వేగం

శివప్రసాద్ అకాల మరణం చిత్తూరు జిల్లాకు తీరని లోటు అని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పెద్దిరెడ్డి అన్నారు.

news18-telugu
Updated: September 22, 2019, 11:49 AM IST
అన్నయ్య అని ప్రేమతో పిలిచే నేత.. శివప్రసాద్ మృతిపై పెద్దిరెడ్డి భావోద్వేగం
శివ ప్రసాద్,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (File Photos)
news18-telugu
Updated: September 22, 2019, 11:49 AM IST
టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ మరణంతో ఆయన కుటుంబ సభ్యులు,ఆయనతో అనుబంధం ఉన్న రాజకీయ నాయకులు విషాదంలో మునిగిపోయారు.చెన్నైలోని అపోలో ఆస్పత్రి నుంచి శివప్రసాద్ భౌతిక కాయాన్ని తిరుపతిలోని ఎన్జీవో కాలనీలో ఉన్న ఆయన స్వగృహానికి తరలించారు. ఈ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. శివ ప్రసాద్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.రాజకీయ పంథా వేరైనప్పటికీ.. తమ ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అన్నయ్య అని ప్రేమతో పిలిచే నేతను కోల్పోయామని భావోద్వేగానికి లోనయ్యారు.విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్న శివప్రసాద్‌కు రాజకీయాలకు అతీతంగా అభిమానులు ఉన్నారని చెప్పారు.

శివప్రసాద్ అకాల మరణం చిత్తూరు జిల్లాకు తీరని లోటు అని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. కాగా, కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శివప్రసాద్.. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

First published: September 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...