కరోనా లాక్ డౌన్ అమల్లో ఉన్న సమయంలో తాను తిరుమల శ్రీవారి ఆలయంలో నిబంధనలు ఉల్లంఘించానని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇవన్నీ రాజకీయ ప్రేరోపణలతో చేసిన అవాస్తవ ప్రచారాలని ఆయన స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్ నెలలో రెండు శుక్రవారాలు స్వామివారి అభిషేకంలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోందన్నారు. నిన్న (మే 1) తన పుట్టిన రోజు రావడం యాదృచ్చికంగా వచ్చిందని వైవీ చెప్పారు. టీటీడీ వ్యవహారాలు, ఆలయాల పర్యవేక్షణ తన విధుల్లో భాగమనీ ఆలయ పర్యవేక్షణ లో భాగంగానే తాను తిరుమలకు వచ్చానన్నారు. నిన్న ఆలయానికి తనతో పాటు తన భార్య, తల్లి మాత్రమే వచ్చారనీ, ఫోటోలోని మిగిలిన వారంతా టీటీడీ ఉద్యోగులేనని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సనాతన ధర్మాన్ని , ఆచారాలను కాపాడటానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు చైర్మన్ చెప్పారు. తన మీద ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేసిన వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Tirumala Temple, Ttd, YV Subba Reddy