కోవిడ్ 19 కారణంగా రూ. 3 వేల కోట్లకుపైనే ఉంటే టీటీడీ వార్షిక బడ్జెట్... రూ. 2 వేల కోట్లకు దిగిరానుంది.
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు విధించిన లాక్డౌన్ నేపథ్యంలో దాదాపు 40 రోజులుగా తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనాన్ని నిలిపేసిన సంగతి తెలిసిందే. అయితే తిరిగి ఎప్పడు భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుందనే విషయంపై తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. భక్తులకు శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటును ఎప్పటి నుంచి కల్పించాలనే విషయాన్ని లాక్డౌన్ సడలింపు అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీంతో పాటుగా శ్రీవారి దర్శనానికి వెళ్లే క్యూలైన్లలో మార్పులు చేర్పులు ఉంటాయని తెలిపారు. కరోనా నివారణకు టీటీడీ ఆధ్వర్యంలో యాగాలు నిర్వహించామని, త్వరలోనే శ్రీవారి కృపతో కరోనా వైరస్ నుంచి బయటపడుతామని తెలిపారు. నెల రోజుల పాటు వలస కూలీలు, అభాగ్యులకు అన్నదానం చేశామని, టీటీడీలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామని గుర్తు చేశారు.
Published by:
Narsimha Badhini
First published:
May 1, 2020, 3:12 PM IST