ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (Mekapati Chandrashekar Reddy) గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం నెల్లూరులోని(Nellore) అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు.. పలు పరీక్షలు నిర్వహించారు. గుండెలో రెండు వాల్వ్‌లు మూసుకుపోయినట్టు డాక్టర్లు చెబుతున్నట్టు తెలుస్తోంది. మెరుగైన చికిత్స కోసం ఆయనను చెన్నైకు(Chennai) తరలించే అవకాశం ఉందని సమాచారం.
వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఈ మధ్యకాలంలో సొంత ప్రభుత్వంపై అసంతృప్తి గళం వినిపిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మూడు రోజుల క్రితం ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయలేమని తేల్చి చెప్పారు. కలిగిరి మండలం నా సముద్రంలో గడపగడపకు మన ప్రభుత్వం చేపట్టిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గ్రామస్తుల సమస్యలను తెలుసున్నారు. గ్రామంలో రోడ్లు దెబ్బ తిన్నాయని వెంటనే వేయాలని గ్రామస్థులు ఎమ్మెల్యేను కోరారు. అయితే పైనుంచి పెండింగ్ బిల్లులకు డబ్బులు ఇవ్వడం లేదని చెప్పారు. సిమెంట్ రోడ్లు వేయలేమని స్పష్టం చేశారు. పనులు చేసిన వారికి డబ్బులు రాలేదని చెప్పారు. ఇలాగైతే పనులు చేయడం కష్టం అని అన్నారు. వడ్డీలకు అప్పులు తెచ్చి ఎవరు పనులు చేస్తారని స్వయంగా ఎమ్మెల్యే అనడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు.
అంతకుముందు కొద్దిరోజుల క్రితం కూడా ఎమ్మెల్యే మేకపాటి ఇదే రకంగా జగన్ సర్కార్‌పై అసహనం వ్యక్తం చేశారు. నేతలను సమన్వయం పర్చకుండా ధనంజయరెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళతానని తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గానికి పరిశీలకుడిగా వచ్చిన ధనుంజయరెడ్డి పార్టీ ఇబ్బందులున్నా, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నా వారిని సర్దుబాటు చేయాల్సిన ధనుంజయ్ రెడ్డి తన వ్యతిరేకులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఆయన పెత్తనాన్ని తాము సహించమని తేల్చి చెప్పారు.
Ysrcp: ఆ జిల్లా వైసీపీ నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు.. ఇద్దరు ఎమ్మెల్యేల పక్కచూపులు ?
నేతలను సమన్వయ పర్చకుండా తనకు వ్యతిరేకంగా గ్రూపులు కడుతున్నారన్నారు. ఆయన వల్ల పార్టీకి తీరని నష్టమని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ధనంజయరెడ్డిని వెనక్కు పిలిపించకపోతే నియోజకవర్గంలో పార్టీ పట్ల వ్యతిరేకత ఎక్కువవుతుందని ఆయన అన్నారు. మేకపాటి కూడా అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ysrcp