హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

MLC Ananta babu Suspension: ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ

MLC Ananta babu Suspension: ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ

ఎమ్మెల్సీ అనంతబాబు (ఫైల్)

ఎమ్మెల్సీ అనంతబాబు (ఫైల్)

ఇటీవల తన డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అనంతబాబు.. అతడిని తానే హత్య చేసినట్టు పోలీసు విచారణలో అంగీకరించారు.

వైసీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీ అనంతబాబుపై చర్యలు తీసుకుంది. ఇటీవల తన డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అనంతబాబు.. అతడిని తానే హత్య చేసినట్టు పోలీసు విచారణలో అంగీకరించారు. దీంతో పోలీసులు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక తన డ్రైవర్‌ను హత్య చేసినట్టు పోలీసు విచారణలో అంగీకరించిన ఎమ్మెల్సీ అనంతబాబుపై(MLC Ananta Babu) వైసీపీ అధినాయకత్వం చర్యలు తీసుకుంది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఎమ్మెల్సీ అయ్యి ఉండి.. స్వయంగా హత్య చేయడం కలకలం రేపింది. రాజకీయంగా వేడి పుట్టించిన ఈ హత్యకేసు విషయంలో పోలీసులపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. వివాదం ఎక్కడ మొదలైంది.. ఎలా హత్య చేసింది అన్ని వివరాలను పూసగుచ్చినట్టు ఎమ్మెల్సీ అనంతబాబు విచారణలో పోలీసులకు తెలిపారు. ఈ హత్య కేసులో (Murder Case) తప్పించుకునే వకాశం లేకపోవడంతోనే.. పోలీసుల ఎదుట లొంగిపోయారు.

అనంతబాబును పోలీసులు చేసిన తరువాత ఆయనను సస్పెండ్ చేసే విషయమై వైసీపీ నాయకత్వం (YSRCP) కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్టు సంకేతాలు ఇచ్చింది. దీనిపై మాట్లాడిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ.. అరెస్టు తర్వాతే సస్పెన్షన్ ఉంటుందన్నారు.

ఇక చట్టానికి ఎవరూ అతీతులు కాదని మరో మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. దావోస్‌లో ఉన్న సీఎం జగన్ కూడా ఎమ్మెల్సీపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. తప్పు చేస్తే ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Amalapuram: కోనసీమ ఘటనలో 46 మంది అరెస్ట్.. పోలీసుల అదుపులో అన్యం సాయి.. ఎవర్నీ వదిలిపెట్టమన్న హోం మంత్రి..

Konaseema: రగులుతున్న కోనసీమ.. నేడు ఛలో రావులపాలెంకు పిలుపు.. అమలాపురం అష్టదిగ్భంధం

ఇక ఈనెల 20న రాత్రి 7.30కి అనంతబాబు అనుచరుడు మణికంఠతో కలిసి సుబ్రహ్మణ్యం బయటకు వెళ్లాడు. 12.30కి ఎమ్మెల్సీ.. సుబ్రహ్మణ్యం తల్లికి యాక్సిడెంట్ జరిగిందని ఫోన్ చేశాడు. 1.30కి వాళ్ల తమ్ముడు నవీన్ కి అనంత బాబు కాల్ చేసి ఆస్పత్రికి రమ్మని చెప్పారు. ఆస్పత్రిలో డాక్టర్లు చనిపోయాడని చెప్పారు. ఆస్పత్రి నుంచి ఇంటికి ఎమ్మెల్సీ కారులో డెడ్‌బాడీ తీసుకు వచ్చారు. నాలుగు గంటల వరకు ఎమ్మెల్సీ అక్కడే ఉన్నారని తెలిపారు. సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు ఎస్పీ. ఆ తర్వాత 302 ప్రకారం హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ హత్యకు అక్రమ సంబంధమే ప్రధాన కారణం అయి ఉంటుందనే అనుమానాలు పెరుగుతున్నాయి

First published:

Tags: Andhra Pradesh, Ysrcp

ఉత్తమ కథలు