విశాఖలో ఉద్రిక్తత.. టీడీపీ ఎమ్మెల్యే ఇంటి ముందు ఆందోళన

విశాఖ వాసి అయి ఉండి..విశాఖపట్టణానికి రాజధాని వస్తుంటే వ్యతిరేకిస్తారా? అంటూ మండిడ్డారు. వెలగపూడి ఇంటి ముందు బైఠాయించి ధర్నాకు దిగారు.

Updated: January 23, 2020, 8:19 PM IST
విశాఖలో ఉద్రిక్తత.. టీడీపీ ఎమ్మెల్యే ఇంటి ముందు ఆందోళన
విశాఖ వాసి అయి ఉండి..విశాఖపట్టణానికి రాజధాని వస్తుంటే వ్యతిరేకిస్తారా? అంటూ మండిడ్డారు. వెలగపూడి ఇంటి ముందు బైఠాయించి ధర్నాకు దిగారు.
  • Share this:
ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపించడంపై వైసీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. టీడీపీ వల్లే మూడు రాజధానుల ప్రక్రియ ఆగిపోయిందంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్రమంలో విశాఖపట్టణంలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఇంటి ముందు వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో చర్చ సందర్బంగా వెలగపూడి నిరసన తెలపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ వాసి అయి ఉండి..విశాఖపట్టణానికి రాజధాని వస్తుంటే వ్యతిరేకిస్తారా? అంటూ మండిడ్డారు. వెలగపూడి ఇంటి ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. వైసీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు