హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

KCR-YSRCP: కేసీఆర్ జాతీయ పార్టీపై వైసీపీ మౌనం.. అప్పటివరకు ఆగుతుందా ?

KCR-YSRCP: కేసీఆర్ జాతీయ పార్టీపై వైసీపీ మౌనం.. అప్పటివరకు ఆగుతుందా ?

వైఎస్ జగన్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

వైఎస్ జగన్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

KCR AP: ఏపీలో విస్తరించేందుకు కేసీఆర్ ఏ విధమైన వ్యూహాలను అనుసరిస్తున్నారు ? ఆ పార్టీ నేతలు ఏపీకి చెందిన ఏయే నేతలతో టచ్‌లోకి వస్తున్నారనే దానిపై వైసీపీ నాయకత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయడం ఖాయమైంది. దసరా రోజున దీనిపై ఆయన ప్రకటన కూడా చేయబోతున్నారు. కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీ ప్రభావం ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉంటుందనే చర్చ సాగుతోంది. అయితే మిగతా రాష్ట్రాల్లో కంటే ఎక్కువగా ఏపీలో తమ జాతీయ పార్టీ ప్రభావం ఉండేలా టీఆర్ఎస్ అధినేత చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. గతంలో తనతో కలిసి టీడీపీలో పని చేసిన సీనియర్ నేతలు, కాంగ్రెస్‌లో పని చేసి రాజకీయాలకు దూరంగా ఉన్న నేతలను తాను ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీలో చేరాలని కేసీఆర్ కోరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వాళ్లతో కేటీఆర్ చర్చలు కూడా జరిపినట్టు ఊహాగానాలు వినిపించాయి.

  అయితే వారిలో ఎంతమంది కేసీఆర్ పార్టీలో చేరతారన్న అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే కేసీఆర్ ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీపై ఏపీలోని అధికార పార్టీ వైసీపీ మాత్రం మౌనం పాటిస్తోంది. కొద్దిరోజుల క్రితం టీఆర్ఎస్ నేతలు ఏపీలోని పరిస్థితులపై చేసిన కామెంట్స్‌ను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. అయితే ఈ సందర్భంగా కేసీఆర్ ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీపై మాత్రం వైసీపీ నేతలు ఎలాంటి కామెంట్ చేయలేదు. అయితే కేసీఆర్ జాతీయ పార్టీపై వైసీపీ సైలెంట్‌గా ఉండటం వెనుక అనేక కారణాలు ఉన్నాయనే చర్చ కూడా సాగుతోంది. కేసీఆర్, జగన్‌ మధ్య ఇప్పటివరకు సత్సంబంధాలే ఉన్నాయి.

  రాజకీయంగా ఇద్దరి దారులు వేరే అయినా.. నేతల మధ్య మాత్రం సంబంధాలు బాగానే ఉన్నాయని రాజకీయవర్గాలు చెబుతుంటాయి. ఈ క్రమంలో కేసీఆర్ జాతీయ పార్టీ విషయంలో సైలెంట్‌గా ఉండటమే మేలు అని వైసీపీ భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈ విషయంలో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన తరువాత ఏపీ రాజకీయాలు లేదా తమపై ఆయన స్పందించే తీరును బట్టి ఆయన జాతీయ పార్టీపై స్పందిస్తే బాగుంటుందని ఆ పార్టీ డిసైడయినట్టు సమాచారం.

  KCR| Munugodu: మునుగోడుపై కేసీఆర్ భారీ ప్లాన్.. ఏకంగా అంతమంది ఎమ్మెల్యేలు రంగంలోకి..?

  Telangana : మండవ ఈసారి పోటీ చేయడం పక్కా .. ఏ పార్టీ నుంచంటే..?

  కేసీఆర్ తమ జోలికి రానంతవరకు ఆయన జోలికి, ఆయన పార్టీ జోలికి వెళ్లడం కరెక్ట్ కాదనే ఆలోచనలో ఏపీలోని అధికార పార్టీ ఉన్నట్టు సమాచారం. అయితే ఏపీలో విస్తరించేందుకు కేసీఆర్ ఏ విధమైన వ్యూహాలను అనుసరిస్తున్నారు ? ఆ పార్టీ నేతలు ఏపీకి చెందిన ఏయే నేతలతో టచ్‌లోకి వస్తున్నారనే దానిపై వైసీపీ నాయకత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. చూస్తుంటే.. కేసీఆర్ జాతీయ పార్టీ విషయంలో వైసీపీ వేచి చూసే ధోరణిని అవలంభించాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Telangana

  ఉత్తమ కథలు