ప్రత్యేక హోదా కష్టమే.. మరో ఆలోచన జరుగుతోందన్న పిల్లి

పిల్లి సుభాష్ చంద్రబోస్ (ఫైల్ ఫోటో)

తన సంవత్సరం పదవీ కాలంలో నాకు సిఎం జగన్ స్వేచ్ఛనిచ్చారని అన్నారు. ఏ రోజు ఆయన కల్పించుకోలేదని తెలిపారు.

  • Share this:
    తన 20 ఏళ్ల రాజకీయ అనుభవంతో రాజ్యసభ సభలో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని రాజ్యసభకు ఎన్నికైన మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదు అనుకుంటున్నానని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్ ప్రత్యేక హోదా కోసం సుదీర్ఘ పోరాటం చేశారని.. అయితే కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేట్లు కనబడలేదని ఆయన తెలిపారు. ఈ విషయంలో కచ్చితమైన అభిప్రాయంతో కేంద్రం వుందని.. ప్రత్యామ్నాయ ఏదో చేసే ఆలోచన జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఎమ్యెల్సీ పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తున్నానని... సీఎం జగన్ కు మంత్రి పదవి రాజీనామా పత్రం ఇస్తానని తెలిపారు.

    తన సంవత్సరం పదవీ కాలంలో నాకు సిఎం జగన్ స్వేచ్ఛనిచ్చారని అన్నారు. ఏ రోజు ఆయన కల్పించుకోలేదని తెలిపారు. నా సంతృప్తి మేరకు పని చేశాని పిల్లి సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు. పార్లమెంట్‌కు వెళ్లాలనేది తన చిరకాల కోరిక అని తెలిపిన పిల్లి.. సీఎం జగన్ సిఎం తనకు మంచి అవకాశం ఇచ్చారని అన్నారు. కౌన్సిల్‌ రద్దు అయ్యే వరకు మంత్రిగా‌ వుండమని కోరారని తెలిపారు. రఘురామకృష్ణంరాజు గెలిచిన పార్టీపై విధేయతతో వుండాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. మన వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా వున్నా పార్టీ అభిప్రాయం సిరోధార్యంగా వుండాలని సూచించారు. లేకుంటే రాజకీయాల్లో మనుగడ సాధించడం కష్టమని అన్నారు.
    First published: