హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YCP on Union Budget: స్టైల్ గా ఉన్నా ఏమీ లేదు.. ఆ పథకం టీడీపీకి కరెక్ట్.. కేంద్ర బడ్జెట్ పై వైసీపీ రియాక్షన్ ఇదే..!

YCP on Union Budget: స్టైల్ గా ఉన్నా ఏమీ లేదు.. ఆ పథకం టీడీపీకి కరెక్ట్.. కేంద్ర బడ్జెట్ పై వైసీపీ రియాక్షన్ ఇదే..!

విజయసాయి రెడ్డి (ఫైల్)

విజయసాయి రెడ్డి (ఫైల్)

కేంద్ర బడ్జెట్‌ (Union Budget) పూర్తిగా నిరుత్సాహపర్చిందని వైసీపీ (YSRCP) అభిప్రాయపడింది. చాలా విషయాలపై ఎలాంటి ప్రస్తావన లేదని.., చూడడానికి స్టైల్‌గా ఉన్నా, అందులో ఏమీ లేదన్నారు వైసీపీ ఎంపీలు.

    కేంద్ర బడ్జెట్‌ (Union Budget) పూర్తిగా నిరుత్సాహపర్చిందని వైసీపీ (YSRCP) అభిప్రాయపడింది. చాలా విషయాలపై ఎలాంటి ప్రస్తావన లేదని.., చూడడానికి స్టైల్‌గా ఉన్నా, అందులో ఏమీ లేదన్నారు వైసీపీ ఎంపీలు. ఆర్థిక మంత్రి చెప్పిన సబ్‌ కా వికాస్‌ అస్సలు లేదన్న వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి.. రాష్ట్రాలకు ప్రయోజనకారిగా ఏ మాత్రం లేదన్నారు. టీడీపీ హయాంలో పరిమితికి మించి రుణాల సేకరణ చేశారని.., ఆ మేరకు ఇప్పుడు కోత విధించడం సరి కాదన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి రాష్ట్రాలకే విధించడం సరికాదని.. కేంద్రం కూడా ఎఫ్‌ఆర్‌బీఎంకు లోబడే రుణాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా అత్యల్పంగా ఉందని.., రాష్ట్రాలకు మూలధన వ్యయం కింద లక్ష కోట్లు ఇస్తామన్నారని.. ఇప్పుడున్న ఫార్ములా మేరకు రాష్ట్రానికి కేవలం రూ.4 వేల కోట్లేనని వెంటనే ఆ ఫార్ములాను సవరించాలి. రాష్ట్ర వాటా పెంచాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. గత ఏడాది ఏపీకి వచ్చింది కేవలం రూ.35 వేల కోట్లు మాత్రమేనన్న విజయసాయి అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌కు ఏకంగా రూ.1.53 లక్షల కోట్ల ఇచ్చారని ఆ స్థాయిలో వ్యత్యాసం ఉంది. వెంటనే దీన్ని సవరించాలని కోరారు.

    ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టిన దాదాపు రూ.40 లక్షల కోట్ల బడ్జెట్, గత ఏడాది కంటే 4.6 లక్షల కోట్ల కన్నా ఎక్కువగా ఉందని.., బడ్జెట్‌ పెరగడం అభినందనీయమైనా, వృద్ధి రేటు చూస్తే.. 2021–22లో 9.2 శాతంగా బడ్జెట్‌లో చూపారన్నారు. కరోనా సమయంలో అంత సాధించడం ప్రశంసనీయమన్నారు. మూలధన వ్యయం కింద గతంలో రాష్ట్రాలకు రూ.15 వేల కోట్లు ఇవ్వగా, ఈసారి లక్ష కోట్లు ఇస్తామని ఆర్థిక మంత్రి చెప్పారన్న విజయసాయి రెడ్డి.. ఇది స్వాగతించదగిన విషయమే అయినా, కేంద్ర పన్నుల వసూళ్లలో రాష్ట్రానికి ఇస్తున్న మొత్తం 4.047 శాతం మాత్రమేనన్నారు. ఇప్పుడు ఇస్తామన్న లక్ష కోట్లులో అదే ఫార్ములాను పరిగణలోకి తీసుకుంటే, రాష్ట్రానికి వచ్చేది కేవలం రూ.4 వేల కోట్లు మాత్రమేని అభిప్రాయపడ్డారు. కేంద్ర పన్నుల్లో ఇతర రాష్ట్రాలను చూస్తే.. మహారాష్ట్రకు 6.31 శాతం, మధ్యప్రదేశ్‌కు 7.8 శాతం, యూపీకి 17.9 శాతం ఇస్తున్నారు. ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. అయినా ఈ నిధుల్లో అన్యాయం జరుగుతోంది. సరైన న్యాయం జరగడం లేదని స్పష్టం చేశారు.

    ఇది చదవండి: ఏపీలో గృహనిర్మాణ లబ్ధిదారులకు ఊరట.. గడువు పొడిగించిన ప్రభుత్వం


    ఆ వ్యయం తిరిగి ఇవ్వాలి

    ఇక గోదావరి–కృష్ణా, కృష్ణా–పెన్నా, పెన్నా–కావేరి నదుల అనుసంధానం నిర్ణయం అభినందనీయమన్నారు విజయసాయి రెడ్డి. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం చేసింది. మరోవైపు కృష్ణా–పెన్నా అనుసంధానంలో కూడా కొంత పని జరిగిందని.., కాబట్టి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులను ఇవ్వాలని కోరారు.

    ఇది చదవండి: ఆ మాజీ మంత్రికి చంద్రబాబు హ్యాండిచ్చినట్టేనా..? వచ్చే ఎన్నికల్లో నో టికెట్..?


    ఆ పథకం టీడీపీకి ప్రయోజనం

    నేషనల్‌ టెలి మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌ పై విజయసాయి సెటైర్లు వేశారు. ఇది కూడా మంచి నిర్ణయమన్న ఆయన.. దీని వల్ల ప్రయోజనం పొందేది తెలుగుదేశం పార్టీ అని.. ఎందుకంటే ఆ పార్టీలో చాలా మందికి మెంటల్‌ సమస్యలు వచ్చాయని.., కాబట్టి దాన్ని వారు వినియోగించుకోవాలని ఎద్దేవా చేశారు. ఇక తూర్పు తీరం డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌. అంటే ఖరగ్‌పూర్‌ నుంచి విజయవాడ వరకు.., అలాగే రాష్ట్రంలోని అన్ని పోర్టులను కలుపుతూ డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌., బోగాపురం జాతీయ రహదారిని వేగంగా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

    ఇది చదవండి: జనసేనను టీడీపీ అలా ట్యూన్ చేస్తోందా..? మరి పవన్ రియాక్షన్ ఏంటో..!


    ప్రైవేటీకరణకు నో

    విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించ వద్దని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. ఎల్‌ఐసీ, హెచ్‌పీసీఎల్‌ వంటి లాభాలు గడిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు కంపెనీ కూడా లాభాల్లో ఉంది కాబట్టి, అమ్మవద్దని కోరుతున్నామన్నారు. సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలులో ముందున్న రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని..పోలవరం ప్రాజెక్టు.. ఇంకా 13వ షెడ్యూల్‌లో ఉన్న అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. వాటికి సానుకూల స్పందన వస్తుందని భావిస్తున్నామని విజయసాయి రెడ్డి చెప్పారు.

    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Budget 2022-23, Vijayasai reddy, Ysrcp

    ఉత్తమ కథలు