YSRCP MPS MEETS PRIME MINISTER NARENDRA MODI AND URGES TO CONDUCT BC CENSES FULL DETAILS HERE PRN
YCP MPs Met PM: ప్రధానితో వైసీపీ ఎంపీల భేటీ.. బీసీ గణన చేపట్టాలని విజ్ఞప్తి.. ఇంకా ఏం చర్చించారంటే..!
ప్రధాని నరేంద్ర మోదీతో వైసీపీ ఎంపీల భేటీ
దేశంలో వెంటనే బీసీ గణన చేపట్టాలని వైసీపీ (YSRCP) ఎంపీలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ని కోరారు. బుధవారం నరేంద్ర మోదీని కలిసిన రాజ్యసభ ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి పలు అంశాలపై చర్చించారు
దేశంలో వెంటనే బీసీ గణన చేపట్టాలని వైసీపీ (YSRCP) ఎంపీలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ని కోరారు. బుధవారం నరేంద్ర మోదీని కలిసిన రాజ్యసభ ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి పలు అంశాలపై చర్చించారు. చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని., అందుకోసం వెంటనే బీసీ జనగణన చేపట్టాలని విజ్ఞప్తిచేశారు. జ్యుడీషియరీలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని.., మెజిస్ట్రేట్ కోర్టు నుంచే అవి అమలు కావాలని కోరారు. ఆదర్శ గ్రామాలకు వెంటనే నిధులు మంజూరు చేయాలన్న ఎంపీలు.. రాష్ట్రం తరహాలో దేశమంతా బీసీ సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా కేంద్రం చొరవ చూపాలన్నారు.
చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, అదే విధంగా జ్యూడీషియరీలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు ఎంపీలు వెల్లడించారు. . అంతకంటే ముందే బీసీ జనగణన చేయాలని కూడా కోరామన్నారు. జనాభా లెక్కలు తేలకుండా, రిజర్వేషన్లు కల్పించాలంటే సాధ్యం కాదు కాబట్టి, బీసీ జనగణన జరపాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. జ్యుడీషియరీలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని..,. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు కేవలం 5గురు ఎస్సీలు మాత్రమే జడ్జీలుగా నియమితులయ్యారన్నారు. ఇంకా 14 హైకోర్టులలో ఈ 75 ఏళ్లలో ఒక ఎస్సీ జడ్జీ లేరన్నారు.
ఇక అమలాపురం నియోజకవర్గంలో కాకినాడ–అమలాపురం రోడ్. కత్తిపూడి దగ్గర మొదలు పెట్టి ద్రాక్షారామం, కోటిపల్లి మీదుగా అమలాపురం వరకు రహదారి నిర్మించాలని, అందుకోసం గోదావరిపై వంతెన నిర్మించాలని ప్రధానిని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఏటా ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని వాటిలో కనీస సదుపాయాలు కల్పించే విధంగా డాక్టర్ జయప్రకాశ్‌నారాయణ్ జయంతి రోజున ప్రధానిగారు ఆ కార్యక్రమం మొదలుపెట్టినా, అమలు కావడం లేదని ఎంపీలు అన్నారు.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా, ఇప్పటికీ బీసీలు ఎక్కడెక్కడ ఎంత మంది ఉన్నారు? వారి జీవన స్థితిగతులు ఏమిటన్నది స్పష్టంగా లేదని.., నిజానికి దేశ వ్యాప్తంగా చూసినా దాదాపు సగం బీసీలు ఉన్నారని ఎంపీలు తెలిపారు. కానీ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వారికి చెప్పుకోదగిన గుర్తింపు లేదని.., వారికి న్యాయం జరగాలంటే, తొలుత బీసీ జనగణన చేసి, రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రధానిని కోరామన్నారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక బీసీలకు స్వర్ణయుగం కొనసాగుతోందని ఎంపీలు అభిప్రాయపడ్డారు. బీసీలు ఎంత మంది ఉన్నారనేది వివరాలు లేకపోయినా, వారికి తగిన గుర్తింపు ఇస్తున్నామని.., నామినేటెడ్ పదవుల్లో బీసీలకు తగిన ప్రాతినిథ్యం కల్పించినట్లు గుర్తుచేశారు. అలాగే అనేక పథకాల ద్వారా కూడా బీసీలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నామని., డీబీటీ, నాన్ డీబీటీ విధానంలో వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు బీసీలకు దాదాపు 4.74 కోట్ల ప్రయోజనాలు అందగా, ఆ విలువ రూ.86,144 కోట్లుగా ఉందన్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.