హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YCP vs BJP: కేంద్ర బడ్జెట్ పై స్వరం పెంచిన వైసీపీ.. ఏపీ బడ్జెట్ తో పోల్చి సెటైర్లు..

YCP vs BJP: కేంద్ర బడ్జెట్ పై స్వరం పెంచిన వైసీపీ.. ఏపీ బడ్జెట్ తో పోల్చి సెటైర్లు..

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ (Union Budget-20220-23) పై వైసీపీ (YSRCP) స్వరం పెంచింది. బడ్జెట్ స్టైల్ గా ఉన్నా.. లోపల ఏమీ లేదంటూ గతంలోనే సెటైర్ వేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy).. పార్లమెంట్ లోనూ కేంద్ర బడ్జెట్ పై విమర్శలు సంధించారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ (Union Budget-20220-23) పై వైసీపీ (YSRCP) స్వరం పెంచింది. బడ్జెట్ స్టైల్ గా ఉన్నా.. లోపల ఏమీ లేదంటూ గతంలోనే సెటైర్ వేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy).. పార్లమెంట్ లోనూ కేంద్ర బడ్జెట్ పై విమర్శలు సంధించారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ (Union Budget-20220-23) పై వైసీపీ (YSRCP) స్వరం పెంచింది. బడ్జెట్ స్టైల్ గా ఉన్నా.. లోపల ఏమీ లేదంటూ గతంలోనే సెటైర్ వేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy).. పార్లమెంట్ లోనూ కేంద్ర బడ్జెట్ పై విమర్శలు సంధించారు.

ఇంకా చదవండి ...

  కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ (Union Budget-20220-23) పై వైసీపీ (YSRCP) స్వరం పెంచింది. బడ్జెట్ స్టైల్ గా ఉన్నా.. లోపల ఏమీ లేదంటూ గతంలోనే సెటైర్ వేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy).. పార్లమెంట్ లోనూ కేంద్ర బడ్జెట్ పై విమర్శలు సంధించారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. ఆర్థిక మంత్రి 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్భాటం తప్ప విషయం లేదని విమర్శించారు. ఈ బడ్జెట్‌ ఆపరేషన్‌ సక్సెస్‌...కానీ పేషెంట్‌ డెడ్‌ అన్నట్లుందని వ్యాఖ్యానించారు. ఇది ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ బడ్జెట్‌ అవుతుందేమోనని ఊహించాం. కానీ బడ్జెట్‌ ప్రసంగం విన్న తర్వాత ఇది ఏ రాష్ట్రానికి చెందని బడ్జెట్‌ అని తేలిపోయిందన్నారు. ఈ బడ్జెట్‌ సబ్‌ కా సాథ్‌ కాదు సబ్‌ కా హాత్‌ అన్నట్లుందని వ్యాఖ్యానించారు.

  ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ భారత్‌ గురించి మాట్లాడుతోందని..., మరి రాష్ట్రాల ఆత్మనిర్భరత ఏమైందని విజయసాయి ప్రశ్నించారు. కేంద్ర పన్నులలో రాష్ట్రాలకు న్యాయంగా దక్కాల్సిన వాటాను కేంద్రం తన హస్తలాఘవం ప్రయోగించి దారుణంగా తగ్గించిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం డివిజబుల్‌ పూల్‌ నుంచి రాష్ట్రాలకు పంపిణీ చేయవలసిన పన్నుల వాటాలో ఏపీ వాటా నానాటికీ తగ్గిపోతున్నదని విజయసాయి రెడ్డి అన్నారు.

  ఇది చదవండి: విజయసాయికి చెక్ పెట్టేందుకు ఆ వైసీపీ నేత స్కెచ్..? ఎంపీ పదవి రాకుండా అడ్డుకుంటున్నారా..?


  ఏపీ, కేంద్ర బడ్జెట్ మధ్య తేడా 

  సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో నామమాత్రపు కేటాయింపులు జరపడాన్ని విజయసాయి రెడ్డి ఆక్షేపించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు ఏపీ ప్రభుత్వం జరిపిన కేటాయింపులకు కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులతో పోల్చారు. 2021-22 బడ్జెట్‌లో వ్యవసాయానికి 5.9 శాతం నిధులు కేటాయిస్తే, 2022-23 బడ్జెట్‌లో కేంద్రం 3.8 శాతం కేటాయించింది. విద్యా రంగానికి ఏపీ 11.8 శాతం నిధులను కేటాయిస్తే కేంద్ర బడ్జెట్‌లో అది కేవలం 2.6 శాతం మాత్రమే ఉంది. ఆరోగ్య రంగానికి ఏపీ బడ్జెట్‌లో 6.0 శాతం కేటాయిస్తే కేంద్ర బడ్జెట్‌లో 2.2 శాతం, గ్రామీణాభివృద్ధికి ఏపీ 7.1 శాతం నిధులు ఇస్తే కేంద్రం 5.2 శాతం, సామాజిక సంక్షేమానికి ఏపీ బడ్జెట్‌లో 12.1 శాతం నిధుల కేటాయింపు జరగ్గా కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అది కేవలం 1.3 శాతం మాత్రమే ఉందని వివరించారు.

  ఇది చదవండి: ఏపీకి షాకిచ్చిన ఆర్బీఐ..? అప్పు చేతికి రాకుండానే జమ..?


  నెరవేరని కేంద్ర ప్రభుత్వ హామీలు

  ఏపీ విభజన చట్టం కింద ఇచ్చిన ప్రధాన హామీలైన వైజాగ్‌ రైల్వే జోన్‌, వైజాగ్‌-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌, పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌, కడప స్టీల్‌ ప్లాంట్‌, దుగరాజపట్నం పోర్టు, కాకినాడ పెట్రో కెమికల్స్‌ కాంప్లెక్స్‌ ఏడేళ్ళు పూర్తయినా కార్యరూపం దాల్చకుండా ఇంకా హామీలుగానే మిగిలిపోయాయని విజయసాయి రెడ్డి అన్నారు. అలాగే విభజన చట్టంలో పొందుపరచిన జాతీయ ప్రాధాన్యం కలిగిన విద్యా సంస్థలైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం ఎనర్జీ-వైజాగ్‌, ఐఐఎం-వైజాగ్‌, ఐఐటీ-తిరుపతి, సెంట్రల్‌ యూనివర్శిటీ, సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్శిటీ ఇప్పటికీ చాలీచాలని వసతి, సౌకర్యాలతో తాత్కాలిక క్యాంపస్‌లలోనే నడుస్తున్నాయని అన్నారు.

  ఇది చదవండి: సీఎం జగన్ తో పేర్ని నాని భేటీ.. చిరంజీవితో మీటింగ్ అజెండాపై చర్చ..


  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై అదే పనిగా విమర్శలు గుప్పించే బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పట్ల మాత్రం నోరు ఎందుకు విప్పదని ఆయన ప్రశ్నించారు. సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, ఔర్‌ సబ్‌కా ప్రయాస్‌ అన్న కేంద్ర ప్రభుత్వ నినాదం చివరకు ఈ బడ్జెట్‌ ద్వారా సబ్‌కా హాథ్‌ అని నిరూపించుకుందని విజయసాయి రెడ్డి అన్నారు.

  First published:

  Tags: Andhra Pradesh, Budget 2022-23, Vijayasai reddy

  ఉత్తమ కథలు