Home /News /andhra-pradesh /

YSRCP MP VIJAYASAI REDDY REQUEST PM MODI REGARDING IMMEDIATE FINANCIAL AID FOR AP AK

ఏపీకి రూ. 6200 కోట్లు ఇవ్వండి... ప్రధానిని కోరిన ఎంపీ విజయసాయిరెడ్డి

విజయసాయిరెడ్డి (File)

విజయసాయిరెడ్డి (File)

ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ కొనసాగించాలని ప్రధానిని కోరినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు.

    కరోనా వల్ల నష్టపోయిన ఏపీని ఆర్థికంగా ఆదుకునేందుకు వెంటనే రూ. 6200 కోట్ల సాయాన్ని అందించేలా చూడాలని వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కోరారు. దేశ వ్యాప్తంగా ,19 రాష్ట్రాలలో 78 హాట్ స్పాట్ ప్రాంతాలను గుర్తించారని ఆయన తెలిపారు. ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ కొనసాగించాలని ప్రధానిని కోరినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు. అయితే మిగిలిన ప్రాంతాలలో లాక్‌డౌన్‌ను దశల వారీగా ఎత్తివేయాలని‌ కోరామని ఆయన తెలిపారు. ఇండియా నుంచి విదేశాలకు వెళ్లి చిక్కుకుపోయిన వారికి కరోనా టెస్టులు చేసి నెగటివ్ వచ్చిన వారిని స్వస్ధలాలకి పంపాలని కోరినట్లు ఆయన వివరించారు. డ్వాక్రా మహిళలకి మాస్క్ లు, గ్లౌవ్స్ ఏ విధంగా తయారు చేయాలనేది టీవీల ద్వారా శిక్షణ ఇవ్వాలని ప్రధాని విజయసాయిరెడ్డి ప్రధానికి సూచించారు.

    మన రాష్ట్రానికి ప్రధాని‌ మోదీ అందిస్తున్న సాయానికి ప్రభుత్వం తరపున కృతజ్ణతలు తాను కృతజ్ఞతలు తెలిపినట్లు పేర్కొన్నారు. మన రాష్ట్రంలో ఉన్న ఎంపీల రెండు సంవత్సరాల జీతాన్ని మన రాష్ట్ర సిఎం సహాయనిధికి అందించేలా సూచించినట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఏపీకి అవసరమైన అన్ని వైద్య పరికరాలని సమకూర్చమని ప్రధానిని కోరినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న1.50 కోట్ల కార్డుల రేషన్ పంపిణీలో రూ.900 కోట్లు అదనంగా భారం పడుతుందన్నారు. అలాగే వెయ్యి రూపాయిల పంపిణీ ద్వారా మరో 500 కోట్ల లోటు కనిపిస్తుందన్నారు. మొత్తం రూ.1400కోట్లు సాయం చేయడంతో పాటు నెలవారీగా కోల్పోయిన రూ. 4800 కోట్ల ఆదాయాన్ని ఆర్థికంగా సాయం అందించాలని కోరినట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Coronavirus, Narendra modi, Vijayasai reddy, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు