Home /News /andhra-pradesh /

YSRCP MP VIJAYASAI REDDY HOT COMMENTS ON LAND SETTELMENTS HE SAID DONT HAVE ONE CENT NGS

MP Vijayasai Reddy: దానిపై వ్యామోహం లేదు.. నా టార్గెట్ ఒక్కటే.. ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

mp vijayasai Reddy

mp vijayasai Reddy

Vijayasai Reddy on Vizag: రాజధాని పేరుతో విశాఖలో భారీగా భూ కబ్జాలు చేస్తున్నారా..? విజయసాయి పేరుతో ఎవరైనా సెటిల్మెంట్స్ చేస్తున్నారా.. ఎంపీ ఏమన్నారో తెలుసా..?

  VijayaSaiReddy: అధికార పార్టీకి చెందిన రాజ్య సభ సభ్యుడు విజయసాయి రెడ్డి (Vijayasai Reddy)పై నిత్యం ఏదో ఒక ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ఆధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఆయన కార్యకలాపాలన్నీ విశాఖ కేంద్రంగానే కొనసాగుతున్నాయి. మొత్తం ఉత్తరాంధ్ర బాధ్యతలు తనకు ఇవ్వడంతో.. విశాఖపట్నం (Visakhapatnam)లో సెటిల్ అయిన ఆయన.. ఉత్తరాంధ్ర వ్యవహరాలన్నీ స్వయంగా చూసుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో ఏం జరిగినా అది ఆయన కనుసన్నల్లోనే జరుగుతుందని.. ఆయన అనుమతి లేనిదే రాజకీయంగా ఎలాంటి అడుగు ముందుకు పడదనే ప్రచారం ఉంది. అయితే ఇటీవల విజయసాయి రెడ్డిని సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan MOhan Reddy) పక్కన పెట్టారు అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ఆ ప్రచారం ఎలా ఉన్నా.. విజసాయి రెడ్డిపై నిత్యం ఎవో ఒక ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా విశాఖపట్నంలో భారీగా భూ కుంభకోణం జరుగుతోందని.. విజయసాయి రెడ్డి ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారని.. భారీగా భూమలు దోచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై విజయసాయి రెడ్డే నేరుగా స్పందించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో తాను భూ కబ్జాలకు పాల్పడుతున్నట్టుగా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. తనకు, తన కుటుంబసభ్యులకు స్థానికంగా సెంటు భూమి కూడా లేదన్నారు.

  ఒక వేల ఎవరైనా తనకు తెలియకుండా.. తనపేరుతో భూ కబ్జాలకు వారిని విడిచిపెట్టను అన్నారు. అలా ఎవరైనా కబ్జాలకు పాల్పడితే ఫిర్యాదు చేసేందుకు త్వరలోనే 2 టోల్ ఫ్రీ ఫోన్ నంబర్లు అందుబాటులోకి తెస్తానని స్పష్టం చేశారు. ఆ నంబర్లకు ఎవరైనా ఫోన్ చేసి కంప్లయింట్ ఇవ్వొచ్చన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూస్తానని హామీ ఇచ్చారు.

  ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఐదుగురు ఐఎఎస్ లకు జైలు శిక్ష.. ఎందుకంటే

  ముఖ్యంగా భూమి వ్యవహారాల్లో తలదూరుస్తున్నానని.. పంచాయితీల్లో కలగజేసుకుంటున్నానని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన తప్పు పట్టారు. తాను హైదరాబాద్ లో ఉండే ఇల్లు కూడా అద్దెదే అన్నారు. అలాగే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నట్టు అసలు తనకు డబ్బుపై ఎప్పుడూ ఆసక్తి కానీ.. వ్యామోహం కానీ లేదన్నారు..

  ఇదీ చదవండి: : అన్నతో విబేధాలపై షర్మిల క్లారిటీ..? కన్నీరు వస్తోంది అంటూ భావోద్వేగ ట్వీట్.. ఏం చెప్పారంటే..?

  వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తరువాత ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో స్థిరపడాలన్నదే తన కోరిక అన్నారు. భవిష్యత్తులో ఇక్కడ సెటిల్ అయితే.. దూరంగా భీమిలిలో వ్యవసాయ భూమి కొనుక్కుంటానన్నారు విజయసాయి రెడ్డి.

  ఇదీ చదవండి: : ఇకపై పెన్షన్ రావాలంటే అలా చేయాల్సిందే.. లేదంటే ఆశలు వదులుకోవాల్సిందే..?

  దివంగ‌త ముఖ్యమంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మనసున్న మహారాజు అని.. ఆయన ప్రజలకు సుపరిపాలన అందించడంతోనే కోట్లాది మంది దేవుడిగా బావిస్తారని.. ఇప్పుడు తండ్రి బాటలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నడుస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయ‌స్ జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారని విజయసాయి వెల్లడించారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా పాలన చేస్తున్నామని.. పార్టీలో కష్టపడిన వారందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Vijayasai reddy, Visakhapatnam, Vizag, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు