హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

నిమ్మగడ్డకు చెమటలు... అవన్నీ తేలాల్సిందే అన్న వైసీపీ ఎంపీ

నిమ్మగడ్డకు చెమటలు... అవన్నీ తేలాల్సిందే అన్న వైసీపీ ఎంపీ

అలాగే, ప్రభుత్వం ఎక్కడెక్కడ సహకరించడం లేదో అఫిడవిట్ సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

అలాగే, ప్రభుత్వం ఎక్కడెక్కడ సహకరించడం లేదో అఫిడవిట్ సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

నిమ్మగడ్డ లేఖలో నిగ్గు తేలాల్సిన మూడు అంశాలు ఉన్నాయని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.

కేంద్ర హోం శాఖకు రాసిన లేఖపై మీడియా వద్ద నోరు విప్పకుండా హైదరాబాద్ జారుకున్న నిమ్మగడ్డకు ఆ లేఖపై పోలీసు దర్యాప్తు కోరగానే ముచ్చెమటలు పట్టినట్లున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. నెల తర్వాత నోరు విప్పి లేఖ రాసింది తానే అంటున్నారని విమర్శించారు. దర్యాప్తు జరిగితే ఎవరి మెడకు ఉచ్చు బిగుస్తుందో ఇప్పటికి బోధపడినట్లుందని వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ లేఖలో నిగ్గు తేలాల్సిన మూడు అంశాలు ఉన్నాయని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. నిమ్మగడ్డ పేరుతో ఆ లేఖపై సంతకం చేసింది ఎవరు? లేఖను ఏ ఐపీ అడ్రస్ ద్వారా హోం శాఖ అధికారికి మెయిల్ చేశారు? ఆ లేఖను ఎక్కడ, ఎవరు డ్రాఫ్ట్ చేశారన్న వాస్తవాలు పోలీసుల దర్యాప్తులో తేలితే కలుగులో దాక్కున్న ఎలుకలన్నీ బైటకు వస్తాయని విజయసాయిరెడ్డి అన్నారు.నిన్న వైఎస్ జగన్ ప్రభుత్వం మీద కేంద్ర హోంశాఖకు తానే లేఖ రాశానని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జగన్ ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలతో ఆ లేఖ ఉండడం పెను సంచలనానికి దారి తీసింది. అయితే, దీనిపై తమకు అనుమానాలు ఉన్నాయని, ఈ లేఖను టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, టీడీపీ నేత వర్ల రామయ్య ఫోర్జరీ చేశారని అనుమానం వ్యక్తం చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ డీజీపీకి లేఖ రాశారు. దీనిపై విచారణ జరపాలని కోరారు. అయితే, విజయసాయిరెడ్డి లేఖ రాసిన కొద్ది సేపటికి రమేష్ కుమార్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ‘రాష్ట్ర ఎస్ఈసీ హోదాలో నేను కేంద్ర హోంశాఖకు లేఖ రాశా. దీనిపై థర్డ్ పార్టీ వ్యక్తులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. కేంద్ర హోంశాఖకు సమాచారం ఇవ్వడం నా పరిధిలోని అంశం. దీన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కూడా ధ్రువీకరించారు. దీనిపై వివాదం అనవసరం.’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Nimmagadda Ramesh Kumar, Vijayasai reddy, Ysrcp

ఉత్తమ కథలు