చంద్రబాబుకు కామినేని శ్రీనివాస్, సృజన చౌదరి సహకరిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. అంతా కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేష్ చేసినవన్నీ కూడా రాజ్యాంగ వ్యతిరేకమే అని... అందుకే కీలకమైన ఎస్ఈసీ పదవికి ఆయన అర్హుడు కాదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల కమిషనర్ని అడ్డం పెట్టుకొని రాజ్యాంగ సంక్షోభం క్రియేట్ చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే పార్టీలకతీతంగా ఎవరైనా సరే చట్టప్రకారం చర్యలుంటాయని విజయసాయిరెడ్డి అన్నారు.
చట్టం తన పని తాను చేసుకుపోతుందని విజయసాయిరెడ్డి తెలిపారు. ఒక పార్టీకి చెందిన వారు, ఒక రాజకీయ నాయకుడికి అనుచరులు చట్టం ప్రకారం తప్పు చేశారని, కాబట్టే పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఎక్కడ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని అన్నారు. మహిళల పట్ల ఎవరైతే పోస్టులు పెట్టారో వారికి అక్కాచెల్లెళ్లు భార్య కుటుంబ సభ్యులు ఉంటారనే విషయాన్ని గుర్తు చేస్తున్నానని అన్నారు. ఇంకా చాలామంది ఉన్నారని వారిపై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.