కొండవీటి వాగుతో అమరావతికి ముప్పు...విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

జగన్ ఏ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను సంప్రదించే తీసుకుంటారని విజయసాయిరెడ్డి చెప్పారు.

news18-telugu
Updated: August 21, 2019, 4:37 PM IST
కొండవీటి వాగుతో అమరావతికి ముప్పు...విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
విజయసాయి రెడ్డి
news18-telugu
Updated: August 21, 2019, 4:37 PM IST
అమరావతి కేంద్రంగా ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది. అమరావతిని ముంపు ప్రాంతంగా చిత్రీకరించి రాజధానిని తరలించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈక్రమంలో రాజధానిని దొనకొండకు తరలిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్న ఊహాగానాలు జోరందుకున్నాయి. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొండవీటి వాగుతో అమరావతికి ముప్పు పొంచి ఉందని వ్యాఖ్యానించారు.

ఢిల్లీలో విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఎంపీల బృందం రైల్వేమంత్రి పీయూష్ గోయెల్‌ని కలిసింది. రైల్వే పెండింగ్ ప్రాజెక్టులకు నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ నేతల దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. కృష్ణా నదిలో నీటిమట్టం పెరగడం వల్లే కొండవీటి వాగుకు వరద వస్తుంది. భారీగా వర్షాలు కురిస్తే కొండవీటి వాగు ఉప్పొంగుతుంది. ఇప్పుడున్న అమరావతి ప్రాంతమంతా ముంపుకు గురవుతుంందన్న విషయం అందరికీ తెలుసు.
విజయసాయిరెడ్డి, వైసీపీ ఎంపీ


జగన్ ఏ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను సంప్రదించే తీసుకుంటారని విజయసాయిరెడ్డి చెప్పారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌, పీపీఏ అంశాల్లోనూ ప్రధాని మోదీతో మాట్లాడాకే జగన్ నిర్ణయం తీసుకున్నారని స్పష్టంచేశారు. చంద్రబాబు హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింని..ఆ సొమ్మును వెనక్కి తీసుకురావడానికి జగన్ కేంద్ర సాయం కోరారని వెల్లడించార విజయసాయిరెడ్డి.



First published: August 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...