ఆంధ్రప్రదేశ్ నుంచి కియా ప్లాంట్ తమిళనాడుకు తరలిపోయే యోచనలో ఉందని జరుగుతున్న ప్రచారంపై వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ రకమైన ప్రచారంలో ఎలాంటి నిజంలేదని ఆయన వివరించారు. కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్న దాంట్లో వాస్తవం లేదని తెలిపారు. సీఎం జగన్ సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం కియాతో మంచి సంబంధాలు కొనసాగిస్తోందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో వారి కార్యకలాపాల విస్తరణకు తాము పూర్తి సహకారం అందిస్తామని ఆయన వివరించారు.
అంతకముందు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రచురించిన ఓ కథనం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. దక్షిణ కొరియాకి చెందిన కియా మోటార్స్... ఆంధ్రప్రదేశ్... అనంతపురం జిల్లాలో ఏర్పాటై... గత డిసెంబర్ నుంచీ ఉత్పత్తి చేపట్టిన విషయం అందరికీ తెలుసు. ఐతే... ఈ... ఏపీ కొత్త ప్రభుత్వ పాలసీలతో ఎడ్జస్ట్ అవ్వలేకపోతున్న కియా మోటార్స్... మెల్లగా తమిళనాడు రాష్ట్రంలోకి తరలిపోయేందుకు అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందన్నది రాయిటర్స్ సంస్థ కథనం. ఈ కథనాన్ని కియా మోటార్స్, ఏపీ ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా ఖండించింది. కియా మోటార్స్ తమతో ఎలాంటి చర్చలూ జరపలేదని తెలిపింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.