హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

వైసీపీ ఎంపీ పార్టీలో వెయ్యి రూపాయల కిళ్లీ...?

వైసీపీ ఎంపీ పార్టీలో వెయ్యి రూపాయల కిళ్లీ...?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇస్తున్న విందులో సుమారు 100 రకాల వంటకాలు అతిథులను నోరూరించనున్నాయి.

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఈనెల 11న ఢిల్లీలో భారీ ఎత్తున విందు ఇవ్వనున్నారు. ఈ పార్టీకి సుమారు 3వేల మందికి పైగా వీఐపీలు హాజరుకానున్నారు. ఈ క్రమంలో రఘురామకృష్ణం రాజు ఇచ్చే విందులో వంటకాల మెనూ భారీగా ఉన్నట్టు తెలిసింది. ఈ విందులో సుమారు 100 రకాల వంటకాలు అతిథులను నోరూరించనున్నాయి. అందులో ముఖ్యంగా గోదావరి రుచులు కూడా ఉండనున్నాయి. దక్షిణాదితోపాటు ఉత్తరాది వంటకాలను కూడా వడ్డించనున్నట్టు సమాచారం. అయితే, వీటన్నిటి కంటే కూడా హైలైట్ అయిన విషయం ఏంటంటే.. ఆ విందులో కిళ్లీనే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రఘురామకృష్ణం రాజు ఇచ్చే విందులో అందిస్తున్న కిళ్లీ వెయ్యి రూపాయలు ఖరీదు చేస్తుందని ప్రచారం జరుగుతోంది.

  రఘురామకృష్ణం రాజు బడా పారిశ్రామికవేత్త. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి. రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2014 ఎన్నికల్లో ఓసారి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి నరసాపురం ఎంపీగా గెలుపొందారు. అయితే, ఆయన బీజేపీ నేతలతో టచ్‌లోకి వెళ్తున్నారంటూ ప్రచారం జరగడం, కొన్ని రోజుల క్రితం పార్లమెంట్‌లో ‘రాజుగారూ బాగున్నారా?’ అంటూ మోదీ పలకరించడంతో ఆయన పేరుమార్మోగిపోయింది. ఈ విషయంలో రఘురామకృష్ణంరాజుకు జగన్ క్లాస్ పీకినట్టు తెలిసింది. అయితే కూడా ఆయన తన పంథాలోనే ముందుకు పోతున్నారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: MP raghurama krishnam raju, Ysrcp

  ఉత్తమ కథలు