హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

జగన్ బతిమిలాడితేనే వైసీపీలో చేరా.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

జగన్ బతిమిలాడితేనే వైసీపీలో చేరా.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీలో ఉంటూ ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై రోజూ విమర్శలు చేస్తున్న రఘురామకృష్ణంరాజు మీద సస్పెన్షన్ వేటు వేయాలంటూ గతంలో స్పీకర్‌‌ను కలసి వైసీపీ నేతలు వినతిపత్రం ఇచ్చారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు. కేవలం ఆయన కూర్చునే సీటును మార్చారు.

ఢిల్లీలో ఉంటూ ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై రోజూ విమర్శలు చేస్తున్న రఘురామకృష్ణంరాజు మీద సస్పెన్షన్ వేటు వేయాలంటూ గతంలో స్పీకర్‌‌ను కలసి వైసీపీ నేతలు వినతిపత్రం ఇచ్చారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు. కేవలం ఆయన కూర్చునే సీటును మార్చారు.

తనపై చేసిన వ్యాఖ్యలతో ప్రసాదరాజుకు త్వరలోనే మంత్రిపదవి వస్తుందని.. ఆయనతో అలా ఎవరు మాట్లాడించారో తనకు తెలుసని రఘురామ కృష్ణం రాజు విమర్శించారు.

  వైసీపీలో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారశైలి ఎప్పడూ చర్చనీయాంశమే. కొంతకాలంగా పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్న ఆయన ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ వచ్చారు. ఆయన బీజేపీ చేరతారని ప్రచారం జరుగుతున్న వేళ.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు తాను వైసీపీలో చేరాలని అనుకోలేదని.. ఆ పార్టీ నేతలు కాళ్లా వేళ్లా పడి బతిమిలాడడం వల్లే వైసీపీలో చేరానని ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. జగన్ పలు మార్లు ఫోన్ చేసి వైసీపీలో చేరాల్సిందిగా రిక్వెస్ట్ చేశారని తెలిపారు. తాను కాకుండా నర్సాపురంలో ఇంకెవరు పోటీ చేసినా ఓడిపోయేవారని రఘురామ కృష్ణం రాజు స్పష్టం చేశారు.

  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జగనన్న ఇళ్ల పథకంలో స్థలాల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయి. కొనుగోళ్లలోనూ గోల్‌మాల్‌ జరుగుతోంది. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా భూములను కొని పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం చూస్తుంటే కొందరు కమీషన్లు తీసుకుంటున్నారు. తిరుమల భూముల వేలం, ఇసుక బ్లాక్‌ మార్కెట్‌కు తరలింపు వంటి అంశాలపై నేను మీడియాతో మాట్లాడా. నా వ్యాఖ్యలపై కొందరు నొచ్చుకున్నారు. పార్టీ అభిమానులు కూడా తప్పుపట్టారు. సీఎంకు సమయం అడిగినా లభించకపోవడంతోనే నేను చెప్పాల్సి వచ్చింది.
  రఘురామ కృష్ణం రాజు, వైసీపీ ఎంపీ

  వైఎస్ జగన్ దయతోనే రఘురామ కృష్ణం రాజు ఎంపీ, పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ అయ్యారని

  నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. తనపై చేసిన వ్యాఖ్యలతో ప్రసాదరాజుకు త్వరలోనే మంత్రిపదవి వస్తుందని.. ఆయనతో అలా ఎవరు మాట్లాడించారో తనకు తెలుసని విమర్శించారు.

  అందరిలాగా ప్రజల మీదపడి డబ్బులు కలెక్ట్ చేయడం తన పద్ధతి కాదన్న రఘురామ.. అటువంటి సొమ్ముతో ఫోటోలు దిగడానికి వెళ్ళలేదని చెప్పుకొచ్చారు. జగన్‌తో ప్రత్యేకంగా మాట్లాడదామనుకున్నా.. టైమ్ ఇవ్వలేదని ఆయన చెప్పారు. ఏదేమైనా ప్రసాదరాజుకి మంత్రి పదవి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నర్సాపురం ఎంపీ సెటైర్లు వేశారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: AP News, MP raghurama krishnam raju, Ys jagan, Ysrcp

  ఉత్తమ కథలు