హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YSRCP MP Biopic: చంద్రబాబే టార్గెట్‌గా... వైసీపీ ఎంపీ బయోపిక్

YSRCP MP Biopic: చంద్రబాబే టార్గెట్‌గా... వైసీపీ ఎంపీ బయోపిక్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

టాలీవుడ్‌లో మరో బయోపిక్ సినిమా రానుంది, ఏపీలో రాజకీయనేతపై ఈ సినిమా రానుంది. ఓ ఎంపీ తాను బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించారు.

తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో బయోపిక్‌లు తెరకెక్కాయి. ఎందరో మహానటుల జీవితాల్ని సినిమాలుగా తీశారు. మరెందరో మహనీయుల జీవితాల్ని వెండితెరపై చూపించారు. అయితే తాజాగా టాలీవుడ్‌లో మరో బయోపిక్ టాక్ ఆప్ ది టౌన్‌గా మారింది. టాలీవుడ్ లో మరో బయోపిక్ తెరకెక్కబోతోంది. ఈసారి ఓ రాజకీయ నేతపై బయోపిక్ రానుంది. ఏపీలో బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ జీవిత చరిత్రతో ఈ బయోపిక్ ను నిర్మించనున్నారు.

ఈ సందర్భంగా నందిగం సురేశ్ మాట్లాడుతూ, ప్రజల కోరిక మేరకు తన బయోపిక్ ను తెరకెక్కించనున్నట్టు తెలిపారు. నెల రోజుల్లో సినిమాను విడుదల చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా, ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై(Ap Cm Jagan Mohan Reddy) వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ (Ysrcp MP Nandigam Suresh) ప్రశంసలు కురిపించారు.  సామాన్యుడినైన తనను జగన్ ఎంపీని చేశారన్నారు నందిగం సురేశ్. ఇది దళితులకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. టీడీపీ చేసిన దారుణాలు, వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై ఈ సినిమా కథ ఉంటుందని నందిగం సురేశ్ తెలిపారు.

అమరావతి విషయంలో దళితులకు చంద్రబాబు (Chandrababu)చేసిన అన్యాయంపై ఈ సినిమా ఉంటుందని చెప్పారు. దళితులకు జగన్ అండగా నిలుస్తున్నారని ప్రశంసలు కురిపించారు. టీడీపీ చేసిన దారుణాలు, వైసీపీ(ycp) ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై ఈ సినిమా కథ ఉంటుందని నందిగం సురేశ్ తెలిపారు. దళితులకు జగన్ అండగా ఉంటారన్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో ఎన్నో బయోపిక్ లు తెరకెక్కాయి. ప్రముఖ నటుడు, దివంగత సీఎం నందమూరి తారక రామరావు జీవితాన్ని కూడా ఎన్టీఆర్ బయోపిక్‌గా తెరకెక్కించారు. చాలా మంది నటీనటుల జీవితాల్ని కూడా సినిమాలు తీశారు, మహా నటి సావిత్రి, సిల్క్ స్మిత, జయలలిత వంటి హీరోయిన్ల జీవితాల్ని కూడా తెరపై చూపించారు.  కాగా ఇప్పుడు ప్రస్తుతం యాక్టివ్ రోల్ లో ఉన్న వైసీపీ ఎంపీ జీవిత చరిత్ర తెరకెక్కనుంది.

First published:

Tags: AP Politics, YSR Biopic Yathra, Ysrcp

ఉత్తమ కథలు