Home /News /andhra-pradesh /

YSRCP MP GORANTLA MADHAV VIDEO CASE UPDATES ABN ANDHRAJYOTHI MD RADHAKRISHNA TO FILE DEFOMATION CASE ON HINDUPURAM MP MKS

Gorantla Madhav Video : న్యూడ్ కాల్ ఉదంతం : ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఆంధ్రజ్యోతి ఆర్కే దావా..

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్

నగ్న వీడియో ప్రసారం చేశారంటూ అసభ్యపదజాలంతో, వ్యక్తిగత దూషణలకు దిగిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ నిర్ణయించుకున్నారు. వివరాలివే..

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh | Vijayawada | Hyderabad
ఆంధ్రప్రదేశ్ లో హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు చెందినదిగా ప్రచారంలో ఉన్న నగ్న వీడియో కాల్ వ్యవహారం (MP Gorantla Madhav Video) అనేక మలుపులు తిరుగుతున్నది. సోషల్ మీడియాలో వైరలైన సదరు వీడియో ఒరిజినల్ కాదని అనంతపురం జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటన తర్వాత మీడియా ముందుకొచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్.. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి రాధకృష్ణ, టీవీ5 యాజమాన్యం, టీడీపీ చీఫ్ చంద్రబాబు, నారా లోకేశ్ లపై పరుషపదజాలంతో విమర్శలు చేశారు. ఫేక్ వీడియో కాదు.. మీ ఇళ్లకు వచ్చి ఒరిజినల్ చూపిస్తానని హెచ్చరించారు. ఈ ఉదంతంలో పలు మార్లు దూషణకు దిగిన ఎంపీపై ఆంధ్రజ్యోతి ఎండీ రాధకృష్ణ న్యాయపోరుకు సిద్ధమయ్యారు..

నగ్న వీడియో ప్రసారం చేశారంటూ అసభ్యపదజాలంతో, వ్యక్తిగత దూషణలకు దిగిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ నిర్ణయించుకున్నారు. గోరంట్ల మాధవ్‌పై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేయనున్నారు. ఆయనపై క్రిమినల్‌ చర్యలు కూడా తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో దావా వేయాలని నిర్ణయించుకున్నారు.

Jagananna Vidya Deevena: నేడే ఖాతాల్లోకి రూ.694 కోట్లు.. బాపట్లలో సీఎం జగన్ విద్యా దీవెన పంపిణీ..


ఈ నెల 4వ తేదీ ఉదయం నుంచి గోరంట్ల మాధవ్‌ ‘డర్టీ పిక్చర్‌’ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ సహా పలు మీడియా సంస్థలు దీనిపై కథనాలను ప్రసారం చేశాయి. అదేరోజున మీడియా ముందుకు వచ్చిన ఎంపీ ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీని అసభ్య పదజాలంతో దూషించారు. బుధవారం మరోసారి ఇదే రీతిలో మాట్లాడారు. దీంతో న్యాయ పరమైన చర్యలు తీసుకోవాలని ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆంధ్రజ్యోతి మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది.

Langya Virus | China: చైనాలో మరో కొత్త వైరస్‌ వ్యాప్తి.. లాంగ్యా హెనిపా వైరస్‌ లక్షణాలివే..


సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో ఒరిజనల్‌ కాదని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప బుధవారం నాడు చెప్పారు. ఒరిజనల్‌ వీడియో దొరికేంతవరకు నిజనిజాలు తెలియవని స్పష్టం చేశారు. పోస్టు చేసిన వ్యక్తి పలుమార్లు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో స్పష్టమైన ఆధారాలు లభించడం లేదని పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చింది మార్ఫింగేనని వెల్లడించారు.

8th Pay Commission : ఉద్యోగులకు భారీ షాక్.. 8వ వేతన సంఘంపై కేంద్రం కుండబద్దలు..


మార్ఫింగ్‌ వీడియోను మొదట ఈనెల 4న ఐ టీడీపీ అఫిషియల్‌ అనే వాట్సాప్‌ గ్రూప్‌లో +447443703968 అనే నంబర్‌తో యూకే నుంచి పోస్టు చేశారని చెప్పారు. ఒక వ్యక్తి రికార్డ్‌ చేసిన వీడియోను ఇంకొకరికి పంపించి ఆ వ్యక్తి తన మొబైల్‌లో చూస్తున్నప్పుడు మరో వ్యక్తి ఆయన మొబైల్‌ ఫోన్‌లోని వీడియోను చిత్రీకరించి ఆ వీడియోను వైరల్‌ చేశారని పేర్కొన్నారు.



ఈ వీడియో సోషల్‌ మీడియాలో పలు సార్లు ఫార్వర్డ్‌ , రీపోస్టు చేయడం జరిగిందని , ఇలా అనేకసార్లు చేయడం వల్ల ఒరిజినల్ అని నిర్దారించలేకపోతున్నామని ఎస్పీ తెలిపారు. ఈ వీడియో ఒరిజినల్‌ కాదు మార్ఫింగ్‌ లేదా ఎడిటింగ్‌ జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. బాధితులు ఎవరూ కూడా ఫిర్యా దు చేయలేదని, ఒకవేళ బాధితులు వచ్చి ఫిర్యాదు వస్తే ఎంపీ ఫోన్‌పై కూడా దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.



తనపై సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియో కాల్ తప్పుడు వీడియో కాల్‌ అని ఆరోజే స్పష్టం చేశానని ఎంపీ గోరంట్ల మాధవ్‌ వెల్లడించారు. ఎస్పీ ఫకీరప్ప ఇవాళ ఫోరెన్సిక్‌ నివేదిక ను విడుదల చేసిన అనంతపురం ఎంపీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫేక్‌ వీడియోను క్రియేట్‌ చేసిన వారిపై పరువునష్టం దావా వేస్తానని పేర్కొన్నారు. కొంతమంది దుర్మార్గులు కలిసి చేసిన పని అని వివరించారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టడానికి ఈ కుట్ర చేశారని మండిపడ్డారు. బీసీలు ఎదుగుతుంటే చూసి టీడీపీ ఓర్వలేక పోతుందని అన్నారు. ఈ క్రమంలో ఎంపీ గోరంట్ల ఏబీఎన్-ఆంధ్రజ్యోతి రాధకృష్ణ, టీవీ5 యాజమాన్యం, టీడీపీ చీఫ్ చంద్రబాబు, నారా లోకేశ్ లపై పరుషపదజాలంతో విమర్శలు చేశారు. ఫేక్ వీడియో కాదు.. మీ ఇళ్లకు వచ్చి ఒరిజినల్ చూపిస్తానంటూ ఎంపీ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
Published by:Madhu Kota
First published:

Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Hindupuram, Ysrcp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు