హోమ్ /వార్తలు /andhra-pradesh /

YCP MLA: ఎమ్మెల్యేపై చేయి చేసుకున్న సీఎం జగన్..? సోషల్ మీడియాలో వైరల్.. అసలు నిజం ఇదే..!

YCP MLA: ఎమ్మెల్యేపై చేయి చేసుకున్న సీఎం జగన్..? సోషల్ మీడియాలో వైరల్.. అసలు నిజం ఇదే..!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (AP CM YS Jagan) ఓ వైసీపీ (YSRCP) ఎమ్మెల్యేపై చేయి చేసుకున్నారంటూ వచ్చిన వార్తలు సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతున్నాయి. దీంతో సదరు ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.

  ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిథులు, ఇతర ప్రముఖులపై పుకార్లు వస్తుంటాయి. గతంలో మౌత్ టాక్ తో పుకార్లు షికార్లు చేసేవి. ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) ట్రెండ్ నడుస్తుండటం.. ఎక్కడ ఏ చిన్న రూమర్ పుట్టినా క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (AP CM YS Jagan) ఓ వైసీపీ (YSRCP) ఎమ్మెల్యేపై చేయి చేసుకున్నారంటూ వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సదరు ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందట. వివరాల్లోకి వెళ్తే... కృష్ణా జిల్లా (Krishna District) మైలవరం ఎమ్మెల్యే  వసంత కృష్ణ ప్రసాద్ పై చేయి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ హల్ చల్ చేస్తోంది.

  దీనికి వైసీపీ కార్యకర్తలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఇది కాస్తా బూతులు పోస్ట్ చేసేవరకు వెళ్లింది. దీంతో ఈ మేటర్ ఆ నోటా.. ఈ నోటా ఎమ్మెల్యే వసంతకు చేరింది. వెంటనే స్పందించిన ఆయన.. మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. వివాదాస్పద పోస్ట్ చేసిన వారి మూలాలు గుర్తించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ పార్టీ కీలకనాయకుడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి పోలీసులకు దొరక్కుండా పరారీలో ఉండటంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

  ఇది చదవండి: అప్పులపై కుండబద్ధలు కొట్టిన ఏపీ సర్కార్.., లెక్కలన్నీ బయటపెట్టిన సీఎంఓ..

  ఇటీవల సోషల్ మీడియాలో రాజకీయ పార్టీల మధ్య యుద్ధం జోరుగానే సాగుతోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఇలా అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఓ రేంజ్ లో పేలుతుంటాయి. సోషల్ మీడియా వార్ పై గతంలో పోలీసులు కేసులు కూడా నమోదయ్యాయి. ఇలాంటి కేసుల్లో పార్టీల మధ్య మాటల తూటాలు పేలిన ఘటనలు కూడా చాలా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ మధ్య సోషల్ మీడియా వేదికగా విమర్శలు, ట్రోల్స్ కొనసాగుతూనే ఉంటున్నాయి. వాటిలో వివాదాస్పదమైన పోస్టుల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమవుతోంది.

  ఇది చదవండి: విజయసాయి రెడ్డిపై ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్.. అంతమాట అనడానికి కారణం ఇదేనా..?

  ముఖ్యంగా ప్రభుత్వంపై వచ్చే విమర్శలు, పథకాలు, కార్యక్రమాలు, రోజువారీ కార్యక్రమాల విషయంలో జరిగే అసత్య ప్రచారాలను అరికట్టేందుకు ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్ ను కూడా ప్రారంభించింది. దీని ద్వారానే సోషల్ మీడియా ప్రచారానికి ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోంది. పూర్తిగా సత్యదూరమైన ప్రచారం విషయంలో ఫిర్యాదులు చేస్తోంది. తాగా వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుంటో వేచి చూడాలి.

  First published:

  ఉత్తమ కథలు