నాకేం సంబంధం.. కంటతడి పెట్టుకున్న వైసీపీ మహిళా ఎమ్మెల్యే

నంబూరులో పేకాట శిబిరానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తెలిపారు.

news18-telugu
Updated: July 30, 2020, 12:21 PM IST
నాకేం సంబంధం.. కంటతడి పెట్టుకున్న వైసీపీ మహిళా ఎమ్మెల్యే
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి(ఫైల్ ఫోటో)
  • Share this:
తాను పేకాట ఆడిస్తున్నానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. తనపై ఇలాంటి ప్రచారం చేయడం బాధాకరమని ఆమె కంటతడి పెట్టుకున్నారు. నంబూరులో పేకాట శిబిరానికి తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రీదేవి తెలిపారు. అసలు పేకాట ఆడిన ప్రాంతం తన నియోజకవర్గం పరిధిలోకి రాదని ఆమె వివరించారు. మహిళా ఎమ్మెల్యేనని చూడకుండా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే తాను ఎస్పీ, ఐజీని కలిసి ఫిర్యాదు చేశానని చెప్పిన ఎమ్మెల్యే శ్రీదేవి... దీనిపై డీజీపీ కలిసి ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఈ ఘటనలో దొరికిన వారిని విడిపించేందుకు తాను పోలీసులపై ఒత్తిడి చేస్తున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు.

అంతకుముందు నంబూరు పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసిన ఘటనపై రాజకీయ దుమారం రేగింది. ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి బంధువు ఉండవల్లి శ్రీదేవి అనుచరుడని... అందుకే అతడిని పోలీసులు అరెస్ట్ చేయడం లేదనే ప్రచారం జరిగింది. నిందితులను కాపాడేందుకు ఎమ్మెల్యే శ్రీదేవి ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై ఎమ్మెల్యే శ్రీదేవి వివరణ ఇచ్చారు. అసలు ఈ పేకాట శిబిరంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
Published by: Kishore Akkaladevi
First published: July 30, 2020, 12:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading