చిత్తూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేయడంపై వైసీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఈ అంశంపై స్పందించిన నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా.. నిమ్మగడ్డ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. నిమ్మగడ్డ ప్రవర్తన చూస్తే ఆయన చిన్న మెదడు చితికిపోయినట్లు అనుమానం వస్తోందని ఆరోపించారు. గతంలో ఇక్కడ అక్రమాలు జరిగాయనే సాకుతో చిత్తూరు, గుంటూరు జిల్లా కలెక్టర్లను మార్చారని గుర్తు చేసిన రోజా.. ఇప్పటికీ ఏకగ్రీవాలు జరిగినా.. వాటిని పునర్ పరిశీలన చేయాలని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డకు ఆయనపైనే నమ్మకం లేకుండా పోయిందేమో అనే రోజా వ్యాఖ్యానించారు.
చంద్రబాబు అండ్ కో డైరెక్షన్ లో నిమ్మగడ్డ ఎలా పనిచేస్తున్నాడని చెప్పడానికి ఇదోక ఉదాహరణ అని రోజా విమర్శించారు. ప్రజలు చేసుకున్న ఏకగ్రీవాలను గౌరవించాలని ఆమె సూచించారు. నిమ్మగడ్డుకు ఎమైనా మతిమరుపు వచ్చిందా ? పూతలపట్టు ఎమ్మెల్యే బాబు ఆరోపించారు. చంద్రబాబు చెప్పినట్లు కాకుండా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ప్రజలందరు గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చిని ఏకగ్రీవం చేసుకున్నారని వ్యాఖ్యానించారు.
చిత్తూరు జిల్లాలో 454 పంచాయతీలకు గాను 110 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అయితే వీటిని ఎస్ఈసీ నిలిపేసింది. తాము తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఏకగ్రీవాలను ప్రకటించకూడదని స్పష్టం చేసింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.