Home /News /andhra-pradesh /

YS Sharmila: వైఎస్ షర్మిలతో వైసీపీ ఎమ్మెల్యే రోజా... ఏం జరుగుతోంది?

YS Sharmila: వైఎస్ షర్మిలతో వైసీపీ ఎమ్మెల్యే రోజా... ఏం జరుగుతోంది?

రోజా సెల్వమణి, వైఎస్ షర్మిల

రోజా సెల్వమణి, వైఎస్ షర్మిల

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిలతో వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా సెల్వమణి సమావేశం అయ్యారు.

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిలతో వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా సెల్వమణి సమావేశం అయ్యారు. వారిద్దరూ కలసి దిగిన ఫొటోను రోజా షేర్ చేశారు. చాలా రోజుల తర్వాత వారిద్దరూ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, అది కేవలం సాధారణ సమావేశమేనని, అందులో ఎలాంటి రాజకీయాలు లేవని రోజా అనుచరులు చెబుతున్నారు. అప్పుడప్పుడు వారు కలుస్తుంటారని, అయితే, ఇప్పుడు ఫొటోలు బయటకు వచ్చాయని అంటున్నారు. నవంబర్ 16న రోజా పుట్టిన రోజు. ఆ రోజు సీఎం వైఎస్ జగన్‌ను కలసిన రోజా ఆశీస్సులు తీసుకున్నారు. ఓ ఎమ్మెల్యేగా కాకుండా రోజాకు జగన్ కుటుంబంతో కూడా సాన్నిహిత్యం ఉంది. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలతో కూడా ఆమె నిరంతరం టచ్‌లో ఉంటారు. ఓ కుటుంబసభ్యురాలిగా కలసిపోతారు. ఈక్రమంలో తాజాగా మరోసారి ఆమె షర్మిలను కలిశారు. ఏపీలో తాజా రాజకీయపరిణామాలపై కూడా వారిద్దరూ చర్చించి ఉండొచ్చని భావిస్తున్నారు. అలాగే, కుటుంబ విషయాలు, పిల్లల చదువుల గురించి కూడా చర్చించారని తెలిసింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Roja Selvamani, YS Sharmila

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు