ఎమ్మెల్యే రోజా నిజంగా గ్రేట్.. పేదల కోసం ఏం చేస్తున్నారో తెలుసా..

రోజా అనగానే ఠక్కున గుర్తొచ్చేది ఫైర్ బ్రాండ్ అని. ఆమె మాట్లాడే మాటలు తూటాల్లా ఉంటాయి. చెంప చెళ్లుమనిపించేలా కనిపిస్తాయి. అసెంబ్లీలో మైక్ అవసరం లేకుండానే తన స్వరంతో ప్రతిపక్షాల దుమ్ము దులిపేస్తారామె.

news18-telugu
Updated: April 7, 2020, 8:13 AM IST
ఎమ్మెల్యే రోజా నిజంగా గ్రేట్.. పేదల కోసం ఏం చేస్తున్నారో తెలుసా..
రోజా(ఫైల్ ఫోటో)
  • Share this:
రోజా అనగానే ఠక్కున గుర్తొచ్చేది ఫైర్ బ్రాండ్ అని. ఆమె మాట్లాడే మాటలు తూటాల్లా ఉంటాయి. చెంప చెళ్లుమనిపించేలా కనిపిస్తాయి. అసెంబ్లీలో మైక్ అవసరం లేకుండానే తన స్వరంతో ప్రతిపక్షాల దుమ్ము దులిపేస్తారామె. నటిగా, రాజకీయ నాయకురాలిగా మెప్పిస్తున్న రోజా.. తన మనసు ఎంత చల్లనిదో నిరూపిస్తున్నారు. మొన్నకి మొన్న పోలీసుల కోసం స్వయంగా వంట చేసిన రోజా.. ఇప్పుడు తనను గెలిపించిన నగరి ప్రజల కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రజల శ్రేయస్సే ముఖ్యం అంటూ, వారి ఆరోగ్యమే తన బాధ్యత అంటున్నారు.

తనకున్న స్టార్ ఇమేజ్‌ను సైతం పక్కన పెట్టి గ్రామగ్రామాన, వాడవాడలా తిరుగుతున్నారు. ప్రజలతో మాట్లాడుతూ కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను వాళ్లకు వివరిస్తున్నారు. మాస్కులను పంచిపెడుతున్నారు. దినసరి కూలీల దీనావస్థను దృష్టిలో ఉంచుకొని నిత్యాన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పారిశుధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు.

Published by: Shravan Kumar Bommakanti
First published: April 7, 2020, 8:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading