రోజా వినూత్న ప్రయోగం... వాళ్లకు కూడా కరోనా పరీక్షలు

ప్రతీకాత్మక చిత్రం

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనా పరీక్షలు ఎక్కువగా జరుగుతున్నాయని... ఇందుకు సీఎం జగన్ తీసుకుంటున్న ప్రత్యేకమైన శ్రద్ధే కారణమని రోజా అన్నారు.

  • Share this:
    కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రంగంలోకి దిగిన వైసీపీ ఎమ్మెల్యే రోజా... కొంతకాలంగా తన సొంత నియోజకవర్గమైన నగరిలోనే ఉంటున్నారు. నియోజకవర్గంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో వినూత్న ప్రయత్నానికి ఆమె శ్రీకారం చుట్టారు. నగరిలో ప్రజలు వైద్య పరీక్షలకు.ముందుకు వచ్చేందుకు పోలీస్, రెవెన్యూశాఖ అధికారులకు పరీక్షలు చేయించారు. విధుల్లో ఉన్న సిబ్బంది, మీడియా ప్రతినిధులకు కూడా రోజా పరీక్షలు చేయించారు. కరోనా పరీక్షలకు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదని రోజా అన్నారు.

    కరోనాను జయించాలంటే ఆయుధాలు లేవని అవగాహన ఒక్కటే మార్గమన్నారు రోజా. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనా పరీక్షలు ఎక్కువగా జరుగుతున్నాయని... ఇందుకు సీఎం జగన్ తీసుకుంటున్న ప్రత్యేకమైన శ్రద్ధే కారణమని రోజా అన్నారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు, పోలీసులు, ఇతర సిబ్బంది ఆరోగ్యం కూడా ముఖ్యమని... అందుకే వాళ్లు కూడా ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. గతంలో లాక్‌డౌన్ సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, ఇతర సిబ్బంది కోసం స్వయంగా వంటి చేసి వడ్డించిన రోజా... తాజాగా వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడాన్ని చాలామంది స్వాగతిస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: