• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • YSRCP MLA ROJA BECOME SLILENT OF SHARMILA ISSUE BECAUSE OF ORDER FROM CM YS JAGAN AK

Roja: ఆ విషయంలో రోజా మౌనం.. జగన్ నుంచి ఆదేశాలు ?

Roja: ఆ విషయంలో రోజా మౌనం.. జగన్ నుంచి ఆదేశాలు ?

ఎమ్మెల్యే రోజా (ఫైల్)

Ysrcp mla Roja: అనేక అంశాలపై మీడియా ముందుకు వచ్చిన తనదైన శైలిలో మాట్లాడే రోజా.. ఒక్క విషయంలో మాత్రం రోజా పూర్తిగా సైలెంట్ అయిపోయారని తెలుస్తోంది.

  • Share this:
    వైసీపీ తరపున అనేక అంశాలపై మాట్లాడటం వారిలో రోజా ముందు వరుసలో ఉంటారు. విపక్షాలను టార్గెట్ చేయడంలో వైసీపీలో రోజా పాత్ర ప్రత్యేకమైనది. తనదైన స్టయిల్లో ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చే రోజా.. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి అదే పని చేస్తున్నారు. అయితే ఒక్క విషయంలో మాత్రం రోజా పూర్తిగా సైలెంట్ అయిపోయారని తెలుస్తోంది. సీఎం జగన్‌తో రాజకీయంగా విభేదించి తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న వైఎస్ షర్మిల.. ఈ విషయంలో వడివడిగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ అంశంపై ఏపీలోని వైసీపీ నేతలెవరూ బహిరంగంగా మాట్లాడటం లేదు. ఈ అంశంపై ఆ పార్టీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి ఒకసారి క్లారిటీ ఇవ్వడంతో.. షర్మిల రాజకీయ పార్టీ విషయంలో అదే తమ అభిప్రాయమని చాలామంది నేతలు చెబుతున్నారట. ఇక ఈ విషయంలో రోజా కూడా సేమ్ టు సేమ్ ఇదే చెప్పి సైలెంట్ అయిపోతున్నారని తెలుస్తోంది.

    అయితే షర్మిల విషయంలో రోజా పెద్దగా స్పందించకపోవడానికి ప్రత్యేకమైన కారణం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇతర నేతలకు చెప్పినట్టుగా వైసీపీలోని పలువురు మహిళా నేతలకు సైతం షర్మిల విషయంలో ఏమీ మాట్లాడొద్దని వైసీపీ నాయకత్వం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఆ నేతల్లో రోజా కూడా ఉన్నారని.. అందుకే షర్మిల కొత్త పార్టీ విషయంలో రోజా ఎక్కడా నోరు జారడం లేదని ప్రచారం జరుగుతోంది. మిగతా నాయకులతో పోలిస్తే.. వైసీపీలో షర్మిలతో రోజాకు సాన్నిహిత్యం కాస్త ఎక్కువ అనే టాక్ ఉంది. అందుకే జగన్‌తో షర్మిల రాజకీయ విభేదాలపై రోజా మాట్లాడతారని చాలామంది అనుకున్నారు. కానీ రోజా మాత్రం ఈ విషయంలో స్పందించలేదు. ఇందుకు అసలు కారణంగా ఈ విషయంలో సీఎం జగన్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండటమే అని తెలుస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు