అంబులెన్స్ నడిపిన రోజా.. కుయ్ కుయ్ సైరన్‌తో రయ్ రయ్‌మని..

అంబులెన్స్ నడిపిన ఎమ్మెల్యే రోజా

నగరిలో అంబులెన్స్‌ల ప్రారంభోత్సవం సందర్భంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా గజమాలతో నివాళి అర్పించారు. పూజాకార్యక్రమాల అనంతరం సైరెన్ మోగిస్తూ స్వయంగా 108 వాహనాన్ని నడిపి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

 • Share this:
  నగరి ఎమ్మెల్యే ఏం చేసినా సెన్సేషనే..! ఏపీ రాజకీయాల్లో నిత్యం ఆమె చర్చనీయంశంగా ఉంటారు. తాజాగా స్టీరింగ్ పట్టి 108 వాహనాన్ని నడిపారు ఎమ్మెల్యే రోజా. కుయ్ కుయ్‌మని సైరన్ మోగుతుంటే.. రయ్ రయ్‌మని టాప్‌గేర్‌లో దూసుకెళ్లారు. ఏపీ సీఎం జగన్ ఇటీవల 1088 కొత్త 108, 104 వాహనాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి ఐదు 104, ఐదు 108 వాహనాలను కేటాయించారు. ఆ వాహనాలు మంగళవారం నగరికి చేరుకున్నాయి. నగరిలో అంబులెన్స్‌ల ప్రారంభోత్సవం సందర్భంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా గజమాలతో నివాళి అర్పించారు. పూజాకార్యక్రమాల అనంతరం సైరెన్ మోగిస్తూ స్వయంగా 108 వాహనాన్ని నడిపి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

  ప్రజారోగ్యం పట్ల వైఎస్ఆర్‌కు బాధ్యత ఉంది గనుకే, ఏ సీఎంకు రాని ఆలోచన వచ్చింది. అందుకే 104, 108 వాహనాలను ప్రవేశపెట్టారు. తండ్రి రెండు అడుగులు వేస్తే తనయుడు 4 అడుగులు ముందుకు వేసి 1088 వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చారు. 108,104 వాహనాలపై చంద్రబాబు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వాళ్ళించినట్లగా ఉంది. రూ. 203 కోట్లతో 108,104 వాహనాలను ఏర్పాటు చేస్తే చంద్రబాబు రూ.100 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం దారుణం.
  రోజా, నగరి ఎమ్మెల్యే


  కరోనా కాలంలో ప్రజలకు భరోసాని ఇవ్వలేని చంద్రబాబు.. అవినీతి పరులైన నేతలను అరెస్ట్ చేస్తే మాత్రం రోడ్డు మీదకు వచ్చారని విమర్శలు గుప్పించారు రోజా. మాట్లాడితే అచ్చెన్నాయుడు బీసీ అంటున్నారని.. ఆయన బీసీ, ఎస్టీ, ఎస్సీల డబ్బులను దోచుకోలేదా అని ప్రశ్నించారు. కొల్లు రవీంద్రను అరెస్ట్ చేస్తే కక్షసాధింపు అంటూ విమర్శిస్తున్నారని.. మరి ఆయన చంపిన భాస్కర్ రావు ఏ కులపు వారో చెప్పాలని ఈ సందర్భంగా నిలదీశారు రోజా. చంద్రబాబు తీరు ఇలాగే ఉంటే.. వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.
  Published by:Shiva Kumar Addula
  First published: